|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒమన్ చమురు క్షేత్రాలపై ఇరాన్ విరుచుకుపడింది! భారత్‌కు ముప్పు?

Published: 11-03-2026, 3:05 PM
ఒమన్ చమురు క్షేత్రాలపై ఇరాన్ విరుచుకుపడింది! భారత్‌కు ముప్పు?
  • ఒమన్ చమురు కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు కలకలం రేపాయి.
  • చారిత్రాత్మక స్నేహం ఉన్నా ఒమన్ పై దాడిని సుల్తాన్ ఖండించారు.
  • యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయింది.
  • భారతదేశంలో ఎల్పీజీ కొరతను అధిగమించడానికి ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుండగా, ఇరాన్ ఒమన్ దేశంలోని చమురు కేంద్రాలపై దాడి చేసింది. ఈ దాడి వీడియో వైరల్ అయింది. దీని ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

ఒమన్ పై ఇరాన్ దాడి ఎందుకు?

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం గత 12 రోజుల నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఇరాన్ మాత్రం వింతగా వ్యవహరిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలను టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగానే తమ మిత్రపక్షమైన ఒమన్ ను కూడా వదలడం లేదు ఇరాన్. తాజాగా ఒమన్ కు చెందిన సలాలాహ్ ( Salalah) రేవులో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. దీనిపై ఒమన్ కూడా స్పందించింది. ఇరాన్ దేశంతో చారిత్రాత్మకంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఇలా దాడులు చేయడం దారుణమని ఒమ‌న్‌ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ అల్ సైద్ సీరియస్ అయ్యారు. దాడులు ఆపాలని కోరారు. అనవసరంగా జనాలను ఇబ్బంది పడుతోందని ఇరాన్ పై మండిపడ్డారు.

భారత్ పై యుద్ధ ప్రభావం

మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన భారతదేశానికి చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా ఆగిపోయింది. దీని వల్ల ఎల్పీజీ, చమురు రవాణా ఇండియాకు రాకుండా పోయింది. ఈ త‌రుణంలోనే ఇండియాలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో భారత దేశవ్యాప్తంగా 25% ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు

A post shared by Kalaburagi times (@kalaburagi_timess)

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతి దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.