|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాకు ఇరాన్ షాక్! ఐదు విమానాలు ధ్వంసం, యుద్ధ మేఘాలు!

Published: 13-03-2026, 9:35 PM
అమెరికాకు ఇరాన్ షాక్! ఐదు విమానాలు ధ్వంసం, యుద్ధ మేఘాలు!
  • ఇరాన్ అమెరికాకు చెందిన ఐదు విమానాలను ధ్వంసం చేసిందని వాల్ స్ట్రీట్ జనరల్ తెలిపింది.
  • సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఈ దాడి జరిగింది.
  • దాడిలో విమానాలు పూర్తిగా ధ్వంసం కాకపోయినా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
  • ఇరాక్ లో అమెరికా KC-135 కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది మరణించారు.

ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. తాజాగా ఇరాన్, అమెరికాకు చెందిన ఐదు విమానాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అమెరికా విమానాలపై ఇరాన్ దాడి

ఇరాన్ వర్సెస్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. దాదాపు 14 రోజులుగా ఈ వారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది మరణించగా, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా తగ్గడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. ఐదు అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

అమెరికాకు చెందిన వైమానిక దళం ఇంధనం నింపే ఐదు విమానాలను ఇరాన్ ధ్వంసం చేసిందని సమాచారం. తన మిస్సైల్స్ తో దాడి చేసి, ఈ విమానాలను ధ్వంసం చేసినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న ఈ విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లు వెల్లడించింది వాల్ స్ట్రీట్ జనరల్. అయితే అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపింది.

వాల్ స్ట్రీట్ జనరల్ ప్రకటన

ఇక ఈ దాడిలో ఎవరు కూడా మరణించలేదని క్లారిటీ ఇచ్చింది వాల్ స్ట్రీట్ జనరల్. ఇది ఇలా ఉండగా నిన్న ఇరాక్ లో కూలిన అమెరికా KC-135లోని ఆరుగురు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు మిడిలిస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్ లోని ఖర్గ్ ద్వీపంపై వేసినట్లు అటు ట్రంప్ వెల్లడించారు. అందులో మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఆయిల్ ఇన్ స్ట్రక్చర్ ను టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇరాక్ లో అమెరికా విమానం కూల్చివేత

A post shared by AviationCircle (@theaviationcircle)

మొత్తానికి ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.