
📌 Key Points
- టాక్సిక్ మూవీ విడుదలపై ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం!
- మిడిల్ ఈస్ట్ దేశాల్లో థియేటర్లు మూసివేత, కలెక్షన్లపై దెబ్బ!
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ వేదిక మార్పు!
- విదేశాల్లో షూటింగ్‌లకు బ్రేక్, టాలీవుడ్‌కు భారీ నష్టం!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం టాలీవుడ్‌ను కూడా తాకింది. ఈ యుద్ధం సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకోవడానికి చదవండి. హీరోల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
యుద్ధంతో థియేటర్లు బంద్.. కలెక్షన్లకు గండి!
Iran vs Israel War : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా వార్.. ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యుద్ధం ఏ మలుపు తిరిగి.. ప్రపంచయుద్ధానికి కారణం అవుతుందో అనే భయం కనిపిస్తోంది. దీంతో ప్రపంచం అంతా ముందుగానే అప్రమత్తం అయింది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థనే కాదు.. సినిమా ఇండస్ట్రీని కూడా వార్ ఎఫెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ మీద ప్రభావం ఎక్కువగా పడే చాన్స్ ఉంది.
షూటింగ్‌లకు బ్రేక్.. భారీ నష్టాలు!
ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో.. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో థియేటర్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది సినిమా రిలీజ్‌లపై ప్రభావం చూపుతోంది. కేజీఎఫ్ తర్వాత టాక్సిక్‌లాంటి క్రేజీ సబ్జెక్ట్‌తో పలకరించేందుకు యశ్ రెడీ అయ్యాడు. ఈ నెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఐతే ఈ మూవీపై.. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ భారీగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
టాక్సిక్ రిలీజ్‌పై టెన్షన్.. ఏం జరుగుతుందో?
మిడిల్‌ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్‌లో థియేటర్లు క్లోజ్ చేయడంతో.. ఆ ప్రాంతాల్లో టాక్సిక్ మూవీ ఆదాయాన్ని కోల్పోయే చాన్స్ ఉంది. భారీ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్న మూవీ టీమ్‌కు.. ఇది కచ్చితంగా షాకే అనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక భారత్ నుంచి పశ్చిమాసియాకు వెళ్లే విమానాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఇది విదేశాల్లో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్న చాలా సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్‌ను.. మిడిల్ ఈస్ట్‌లో ప్లాన్ చేయగా.. అది ఇండియాకు షిఫ్ట్ అయింది. ఇక అటు అమెరికాలోనూ తెలుగు సినిమాలపై గట్టిగానే ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా.. ఈ యుద్ధం ఫిల్మ్ ఇండస్ట్రీకి భారీ టెన్షన్‌గా మారింది.
యుద్ధం టాలీవుడ్‌పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఏ క్షణమైనా సంచలన వార్తలు రావొచ్చు.


