|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాఖ తీరంలో విన్యాసాలు.. గల్ఫ్ తీరంలో మృత్యుఘోష! ఇరాన్ నావికాదళానికి ఏమైంది?

Published: 04-03-2026, 4:35 PM
విశాఖ తీరంలో విన్యాసాలు.. గల్ఫ్ తీరంలో మృత్యుఘోష! ఇరాన్ నావికాదళానికి ఏమైంది?
  • ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడిలో పలువురు మృతి
  • 10 రోజుల క్రితం విశాఖలో కవాతు చేసిన ఇరాన్ నావికాదళ సభ్యులు మృతి
  • మిలాన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న నావికాదళం
  • విషాదంలో ఏపీ పౌరులు, తమతో గడిపిన వారు మృతి చెందడం బాధాకరం

ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా నేతృత్వంలోని దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు మృతి చెందారు. విశాఖలో ఇటీవల జరిగిన మిలాన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న నావికాదళ సభ్యులు కూడా మరణించిన వారిలో ఉన్నారు.

గల్ఫ్ ఆఫ్ ఉమెన్‌లో ఇరాన్ నౌకపై దాడి

ఇరాన్‌, ఇజ్రాయెల్-యూఎస్ఏ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 5 రోజుల నుంచి ఇరాన్‌, ఇజ్రాయెల్-యూఎస్ఏ మ‌ధ్య యుద్ధం భ‌యంక‌రంగా సాగుతోంది. అయితే, ఇలాంటి నేప‌థ్యంలో ఇరాన్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. గల్ఫ్ ఆఫ్ ఉమెన్ ప్రాంతంలో ఇరాన్ కు సంబంధించిన యుద్దన ఒకపై అమెరికా నేతృత్వంలోని దళాలు దాడి చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఇరాన్ యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతిందని చెబుతున్నారు.

విశాఖలో కవాతు చేసిన నావికాదళం సభ్యుల మృతి

దీంతో ఆ నౌక నీళ్లలోనే మునిగిపోయిందని సమాచారం. ఇందులో చాలామంది ఇరాన్ కు సంబంధించిన సిబ్బంది మృతి చెందారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే, 10 రోజుల క్రితం విశాఖలో కవాతు నిర్వహించిన ఇరాన్ కు చెందిన నావికాదళం సభ్యులు కూడా ఈ సంఘ‌ట‌న‌లో మ‌ర‌ణించారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇటీవల విశాఖపట్నంలో మిలాన్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నౌకాదళ విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలలో పది రోజుల కిందట ఇరాన్ నావికాదళం సభ్యులు పాల్గొన్నారు. వాళ్లే ఇప్పుడు అమెరికా దాడిలో మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై ఏపీకి చెందిన పౌరులు ఎమోషనల్ అవుతున్నారు. తమతో జాలీగా గడిపిన వాళ్ళు ఇప్పుడు మరణించడం దారుణం అంటున్నారు.

మిలాన్ 2026 కార్యక్రమంలో విషాదం

A post shared by Crazziee Stuff (@crazziee_stuff)

విశాఖలో సందడి చేసిన నావికాదళ సభ్యులు హఠాత్తుగా మరణించడం బాధాకరం. ఈ సంఘటన ప్రాంతీయంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.