|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భూగర్భంలో ఇరాన్ అణు గుహలు! మిస్సైల్ సిటీ వీడియోతో ప్రపంచానికి సవాల్!

Published: 13-03-2026, 9:05 PM
భూగర్భంలో ఇరాన్ అణు గుహలు! మిస్సైల్ సిటీ వీడియోతో ప్రపంచానికి సవాల్!
  • ఇరాన్ తన అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీ వీడియోను విడుదల చేసింది.
  • సూసైడ్ డ్రోన్ బోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఇరాన్ వెల్లడించింది.
  • హర్మూజ్ జలసంధిలో డ్రోన్ బోట్లను మొహరించనున్నట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటన చేసింది.
  • ఇరాన్ అగ్ర లీడర్ల సమాచారం ఇచ్చిన వారికి అమెరికా రూ. 92.5 కోట్లు రివార్డు ప్రకటించింది.

ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీని వీడియో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాకుండా, తమ వద్ద సూసైడ్ డ్రోన్ బోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వెల్లడించింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీని పరిచయం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్, అమెరికా దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఇరాన్ దేశం సంచలన ప్రకటన చేసింది. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. తమ వద్ద పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయని ఇందులో వెల్లడించింది. వాటిని హర్మూజ్ జల సంధిలో ( Strait of Hormuz) మొహరిస్తున్నారని ప్రకటన చేసింది ఇరాన్ మిలిటరీ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి మరి వార్నింగ్ ఇచ్చింది. దీనిని అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీగా ( Underground Missile City) పిలుస్తామని తెలిపింది.

సూసైడ్ డ్రోన్ బోట్ల గురించి ఇరాన్ ప్రకటన

నేవల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిస్సైళ్ళు, సముద్ర మైన్స్ ఈ టన్నెల్స్ లో భారీగా కనిపించాయి. కాగా ఇటీవల సూసైడ్ డ్రోన్ తోనే అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇరాన్ అగ్ర లీడర్ల సమాచారం అందిస్తే రూ. 92.5 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా తాజాగా ప్రకటన చేసింది. వాళ్ల జాడ చెప్పిన వాళ్లకు రివార్డు ఇవ్వడమే కాకుండా భద్రత కూడా కల్పిస్తామని పేర్కొంది. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీతో పాటు మరో 9 మంది సమాచారం ఇవ్వాలని అమెరికా పేర్కొంది.

ఇరాన్ లీడర్ల సమాచారం కోసం అమెరికా రివార్డు

A post shared by Times Now (@timesnow)

ఇరాన్ యొక్క మిస్సైల్ సిటీ వీడియో విడుదల, డ్రోన్ల మోహరింపు ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది. అమెరికా రివార్డు ప్రకటన పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఉంది. భవిష్యత్తు పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.