
📌 Key Points
- ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు.
- ఖోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం.
- అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు ఈ విషయం తెలుసని ‘ది టైమ్స్’ పత్రిక వెల్లడి.
- ఆయన తండ్రి ఫిబ్రవరి 28న మరణించారు; ఖోమ్‌లో ఖననం చేయవచ్చు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఖోమ్‌లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమం?
ఇరాన్ కొత్త సుప్రీం లీడ్ర్ మొజ్తాబా ఖమేనీ గురించి అంతర్జాతీయ మీడియాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తండ్రి అలీ ఖమేనీని అంతం చేసిన రోజే గాయపడిన మొజ్తాబా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారని, ఖోమ్ నగరలో చికిత్స పొందుతున్నట్టు, ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని కథనాలు వెలువడుతున్నాయి. మొజ్తబా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్ర వైద్య పరిస్థితికి చికిత్స పొందుతున్నారని ‘ది టైమ్స్’ పత్రిక నివేదించింది. ఈ విషయం అమెరికా, ఇరాయెల్ నిఘా సంస్థలకూ తెలుసని పేర్కొంది. తీవ్రమైన అనారోగ్యం కారణంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారనే విషయం బయటపడటం ఇదే మొదటిసారి. ఖోమ్ నగరం టెహ్రాన్‌కు సుమారు 140 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ నగరాన్ని షియా ఇస్లాంలో పవిత్రమైనదిగా భావిస్తారు, దీన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ మతపరమైన రాజధానిగా కూడా పిలుస్తారు.
మొజ్తబా ఖమేనీ ఆచూకీ గురించి సమాచారం అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార సంస్థల వద్ద ఉన్నప్పటికీ, బహిరంగపరచలేదని నివేదికలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇతర కుటుంబ ఖోమ్‌లో ఖననం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడే మొజ్తబా ఖమేనీని కూడా ఖననం చేయవచ్చని టైమ్స్ నివేదిక పేర్కొంది. దీన్ని బట్టి కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ పరిస్థితి విషమంగా ఉండవచ్చని భావిస్తున్నారు. మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలు కూడా కోల్పోయి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు. ఖమేనీని చికిత్స నిమిత్తం రష్యాలోని మాస్కోకు తరలించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఇరాన్ అధికార వర్గాలు అధికారికంగా ఈ విషయాలను ధ్రువీకరించలేదు.
ఖోమ్‌లో చికిత్స, నిఘా వర్గాల సమాచారం
అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు
మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆయన కోలుకోవాలని ఆశిద్దాం.


