|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇజ్రాయెల్‌కు ఇరాన్ అల్టిమేటం: ఎంబసీలు పేల్చేస్తాం!

Published: 04-03-2026, 8:05 PM
ఇజ్రాయెల్‌కు ఇరాన్ అల్టిమేటం: ఎంబసీలు పేల్చేస్తాం!
  • ఇజ్రాయెల్ ఎంబసీలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిక.
  • లెబనాన్‌లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇరాన్ హెచ్చరించింది.
  • ప్రపంచంలోని ఇజ్రాయెల్ ఎంబసీలను టార్గెట్ చేస్తామని ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి ప్రకటన.
  • లేబనాన్‌లోని ఇరాన్ ఎంబసీలోని ప్రతినిధులు 24 గంటల్లో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది.

ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. తమ ఎంబసీలపై దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎంబసీలను ధ్వంసం చేస్తామని తేల్చి చెప్పింది.

ఇరాన్ సంచలన హెచ్చరిక

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజులుగా వీళ్ళ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ మరణించారు. అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాదు తాజాగా ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయిల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.

లెబ‌నాన్ లోని తమ ఎంబసీలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది ఇరాన్. తమ ఎంబసీ జోలికి వస్తే.. ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీలు అన్నిటినీ ధ్వంసం చేస్తామని.. ఆ దిశగా దాడులు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు లేబనాన్‌ లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని..ఇందుకు 24 గంటల గడువు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. ఈ త‌రుణంలోనే రివర్స్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్‌.

ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిస్పందన

ప్రపంచవ్యాప్తంగా ఎంబసీలపై దాడి?

ఇరాన్ హెచ్చరికతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పరిస్థితి తీవ్రంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.