
బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్, తన కంటే 24 ఏళ్లు పెద్ద నటి టబుతో నటించిన ‘ఎ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్ లోని రొమాన్స్ సన్నివేశం గురించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
ఇషాన్ ఖట్టర్, టబుతో 'ఎ సూటబుల్ బాయ్' వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశం చేశాడు.
వయసులో 24 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ, ఆ సన్నివేశాన్ని చాలా సహజంగా చేశారని ఇషాన్ తెలిపాడు.
టబుతో పనిచేయడం చాలా సరదాగా ఉందని, ఆమె చాలా సహాయపడిందని ఇషాన్ అన్నాడు.
రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఎటువంటి అసౌకర్యం లేదని ఇషాన్ వెల్లడించాడు.
ఇషాన్ ఖట్టర్ – టబు జంట
బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్ తెలుసు కదా. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ది రాయల్స్ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడు ఇతడు. ధడక్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతడు.. ఆ మధ్య ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ లో తన కంటే వయసులో 24 ఏళ్లు పెద్దదైన టబుతో ఓ ఘాటు రొమాన్స్ సీన్ చేశాడు.
ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. అందులో ఇషాన్, టబు మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది. ఆ సీన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల ప్రేక్షకులకు ఇది చాలా వింతగా అనిపించింది. దీనిపై తాజాగా ఇషాన్ స్పందిస్తూ.. తాము అసలు దాని గురించి పట్టించుకోలేదని జూమ్ ఇంటర్వ్యూలో అన్నాడు.
‘ఎ సూటబుల్ బాయ్’ లో రొమాన్స్ సీన్
“ఈ ఘనత రైటింగ్‌కే దక్కుతుంది. ఇంత వయసులో తేడా ఉన్న మా ఇద్దరినీ మరో చోట, మరో స్టోరీలో ఇలాంటి సీన్లో చూస్తే వింతగా అనిపించవచ్చు. కానీ ఈ స్టోరీ రాసిన తీరు ఆ సీన్ కు న్యాయం చేసింది. అసలు మేము ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోలేదు” అని ఇషాన్ చెప్పాడు.
టబుతో తన ఇంటిమేట్ సీన్ పై ఇషాన్ ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించాడు. “ టబు లాంటి నటితో ఇలాంటి సీన్ చేయడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అసలు ఏమాత్రం ఆందోళనగా ఫీలవలేదు. నిజానికి నేను చాలా సేఫ్ గా ఫీలయ్యాను.
వయసు తేడాపై ఇషాన్ స్పందన
నేను ఏం చేస్తున్నానో తెలుసుకోగలిగే నటితో కలిసి నటిస్తుండటమే అందుకు కారణం. అదే కాదు ఈ సీన్ ను మరో స్థాయికి కూడా తీసుకెళ్లగలదు. టబులో అదే గొప్ప విషయం. ఓ సీన్లో తాము ఏం చేస్తున్నామన్నదానిపై మేమెప్పుడూ మాట్లాడుకోలేదు” అని ఇషాన్ అన్నాడు.
ఇక టబుతో ఇలాంటి సీన్లలో నటించడాన్ని తాను బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా ఇషాన్ ఖట్టర్ స్పష్టం చేశాడు. “ఆమె ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉండేది. లంచ్ కు ఏం కావాలిలాంటివి. ఆమె చాలా నాటీ. సెట్ లో ఓ చిన్న పిల్లలా ఉంటుంది. అప్పుడే జోక్ చేస్తుంది. అప్పుడే పాత్రలో లీనమైపోతుంది. ఆమెతో నటించడం చాలా సరదాగా అనిపించింది” అని ఇషాన్ చెప్పాడు.
చివరగా, ఇషాన్ ఖట్టర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, టబుతో పనిచేయడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, ఆమె ప్రొఫెషనలిజం, సహజత్వాన్ని ప్రశంసించాడు.


