|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇషితా దత్తా: రెండో బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్

Published: 10-06-2025, 12:15 PM
ఇషితా దత్తా: రెండో బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్

బాలీవుడ్ నటి ఇషితా దత్తా తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. తెలుగు చిత్రం ‘చాణక్యుడు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషితా, భర్త వత్సల్ సేత్‌తో కలిసి తమ ఆనందాన్ని పంచుకుంది. వీరికి ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు.

Key Points

1

ఇషితా దత్తా రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

2

ఈ జంటకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు.

4

ఇషితా తెలుగు చిత్రం 'చాణక్యుడు'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇషితా దత్తా రెండో బిడ్డకు జన్మనిచ్చింది

బాలీవుడ్‌ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్‌ సేత్ ఒకరు. తెలుగులో  చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్‌ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా..  ఆ తర్వాత బాలీవుడ్‌ నటుడు వత్సల్‌ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.

తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.

వాలెంటైన్స్ డే శుభవార్త

కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్‌  గుడ్‌ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి’ అంటూ వాలైంటైన్‌ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్‌ 2017లో పెళ్లి చేసుకున్నారు. ‘రిష్టన్ కా సౌదాగర్ – బాజీగర్’ అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.

చాణక్యుడు సినిమా హీరోయిన్

సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం -2’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్‌ చివరిసారిగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్‌ వంటి చిత్రాల్లో నటించింది.

ఇషితా దత్తా మరియు వత్సల్ సేత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబానికి సుఖ శాంతులు లభించాలని కోరుకుందాం. వారి భవిష్యత్ కెరీర్ కు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.