|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా!

Published: 05-08-2025, 7:21 AM
టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా!

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే తెలుగు సినిమాలో అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా విడుదల కానుంది.

Key Points

1

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

2

‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

4

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయనుందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్‌. రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలతో బాలీవుడ్ ‌ ప్రేక్షకులను ఆలరించిన జాక్వెలిన్ ‌ ని ‘ పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‌ టాలీవుడ్ ‌ కి పరిచయం చేయబోతున్నాడు . ఆయన దర్శకత్వం వహించే ఓ ఉమెన్ ‌ సెంట్రిక్ ‌ మూవీలో జాక్వెలిన్ ‌ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం .

జయశంకర్ దర్శకత్వం

జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వివరించారట. జాక్వెలిన్‌కు జయశంకర్ చెప్పిన పాత్ర, కథ చాలా నచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్నందున జాక్వెలిన్ కూడా పాత్రను పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ సైతం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్ చిత్రం

ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, జాక్వెలిన్‌ ఇది వరకు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతోన్నట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన వర్క్ కూడా చాలా ఉందని సమాచారం. ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ అంశాలతో చిత్రం రూపొందనుందట. జాక్వెలిన్ పాన్ ఇండియా నటి కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో నిర్మించనున్నారట. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టుగా సమాచారం.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.