|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్

Published: 30-04-2025, 12:19 AM
3Dలో రీ రిలీజ్ కాబోతున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. ట్వీట్ వైరల్

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా 3D లో రీ రిలీజ్ కానుంది. వైజయంతి మూవీస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 3Dలో రీ-రిలీజ్.

2

మే 9న 2D మరియు 3D వర్షన్లలో సినిమా రీ-రిలీజ్.

4

1990లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

జగదేక వీరుడు అతిలోక సుందరి 3D రీ రిలీజ్

ప్రస్తుతం రీరిలీజ్(ReRelease) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ అండ్ ప్లాప్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. వాటిని ప్రేక్షకులు కూడా అంతే అభిమానంగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ఓ మూవీ కూడా థియేటర్లలో అది కూడా 3డీ పిక్చర్స్‌లో రాబోతుంది. అయితే ఆ సినిమా మరేదో కాదండోయ్.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka Sundari).

వైజయంతి మూవీస్ ప్రకటన

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(Raghavendra rao) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీదేవి(Sridevi) హీరోయిన్‌గా నటించింది. ఇక అశ్విని దత్(Ashivini Dutt) నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా(Ilayaraja) సంగీతం అందించాడు. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 1990లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ట్వీట్ వైరల్

అయితే ఇంతటి విజయాన్ని సాధించిన ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన విషయాన్ని వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9 వ తేదీన 2D మరియు 3D వర్షన్‌లలో రీ రిలీజ్ చేనున్నాము’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్‌లో భాగంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ ఇంపాక్ట్‌ను చూపిస్తుందో చూడాలి.

చిరంజీవి, శ్రీదేవి జంట నటనతో అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, 3D లో రీ-రిలీజ్ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.