|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్? పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దన్న జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

Published: 09-05-2026, 8:45 AM
పాన్ ఇండియా మోజులో టాలీవుడ్? పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దన్న జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!
  • జగపతిబాబు పాన్ ఇండియా సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  • రాజమౌళిని చూసి అందరూ బాహుబలి చేయలేరని స్పష్టం చేశారు.
  • పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.
  • పాన్ ఇండియా పేరుతో చాలా సినిమాలు నష్టాలు చవిచూస్తున్నాయని తెలిపారు.

నటుడు జగపతిబాబు పాన్ ఇండియా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళిని చూసి అందరూ భారీ బడ్జెట్ సినిమాలు తీయడం సరైంది కాదన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉందని, దీనివల్ల టాలీవుడ్ నష్టపోతుందని హెచ్చరించారు.

జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు

Jagapathi Babu: జగపతిబాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన కథా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం హీరోగా కాకుండా విలన్ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం విలన్ పాత్రలలోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే జగపతిబాబు హీరోగా కంటే కూడా విలన్ పాత్రల ద్వారానే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వివిధ భాష సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న జగపతిబాబు ఇటీవల గోదారి గట్టుపై అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జగపతిబాబు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతూనే పడిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్, టెక్నీషియన్ ఆయన బాహుబలి సినిమా చేశారు.

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్?

రాజమౌళి తరహాలోనే అందరూ బాహుబలి సినిమా చేయాలంటే కుదరదని అలా చేయడం అనేది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అంటూ జగపతిబాబు తెలిపారు. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారని మనం కూడా వెయ్యి కోట్లు పెట్టి సినిమా చేయటం అనేది సరైన ఆలోచన కాదు. మనం ఎంత చేయగలమో అంతే చేయాలి ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కాకపోయినా ప్రతి ఒక్కరు పెద్ద సెలబ్రిటీలమనే భావనలో ఉన్నారని తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇటీవల బాహుబలి పుష్ప వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.

పేరుకే పాన్ ఇండియా సినిమా…

రాజమౌళిని అనుకరించడం సరైనదేనా?

ఈ సినిమాల తరహాలోనే చాలామంది ఇతర భాషలలో సినిమాలను డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తున్నారు. పేరుకే పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ ఇతర భాషలలో కనీసం ఓపెనింగ్ కూడా రాబట్ట లేకపోతున్నాయని, ఇలాంటి వారందరూ కూడా రాజమౌళిని చూసి చేతులు కాల్చుకున్న వారే అంటూ పాన్ ఇండియా సినిమాలపై జగపతిబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఇటీవల ప్రతి ఒక్క సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ భారీ నష్టాలను కూడా ఎదుర్కొంటున్న వారు ఉన్నారు అలాంటి వారిని ఉద్దేశించే ఈయన ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

జగపతిబాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాన్ ఇండియా పేరుతో వస్తున్న చిత్రాల విజయావకాశాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.