|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jailer- 2: జైలర్-2 లో బాలకృష్ణ.. రజినికాంత్ సినిమాపై హైప్ పెంచేస్తున్న ట్వీట్

Published: 30-04-2025, 6:45 AM
Jailer- 2: జైలర్-2 లో బాలకృష్ణ.. రజినికాంత్ సినిమాపై హైప్ పెంచేస్తున్న ట్వీట్

‘జైలర్’ సినిమా తర్వాత రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా జైలర్ 2లో బాలకృష్ణ కామియో రోల్ చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

జైలర్ 2లో బాలకృష్ణ కామియో రోల్ చేస్తున్నారని వార్తలు

2

బాలయ్యతో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం

4

త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని అంచనాలు

జైలర్ 2: తాజా అప్డేట్స్

‘జైలర్’ (Jailer) సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘జైలర్-2’ (Jailer- 2) ఒకటి. సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న జైలర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన టీజర్‌(teaser)కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా.. మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు వసంత్ రవి, మీర్నా మీనన్, యోగిబాబు, వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు ఇప్పుడు ‘జైలర్-2’లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

బాలకృష్ణ కామియో రోల్?

అయితే.. టీజర్ తర్వాత ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులకు కూడా కిక్ ఇచ్చే ఓ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా ప్రచారం అవుతుంది. ‘జైలర్-2’లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కామియో రోల్‌(Cameo role)లో నటిస్తున్నట్లు తమిళ్ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే దీనికోసం బాలయ్యతో సంప్రదింపులు జరపగా ఆయన కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వైరల్ అవుతున్న ట్వీట్స్.. రజినీకాంత్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో హైప్

#Jailer2 – Jai Balayaa….💥 pic.twitter.com/y5ogGe9cpi

బాలకృష్ణ జైలర్ 2లో నటించడం ఖాయమైతే, ఈ సినిమాకు మరింత హైప్ వస్తుంది. రజనీకాంత్, బాలకృష్ణ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.