|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జన నాయగన్ షాకింగ్ ట్విస్ట్: సెన్సార్ గోల.. జనవరి 9న ఫైనల్ వార్!

Published: 07-01-2026, 8:45 AM
జన నాయగన్ షాకింగ్ ట్విస్ట్: సెన్సార్ గోల.. జనవరి 9న ఫైనల్ వార్!
  • విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కు సెన్సార్ అడ్డంకులు.
  • మద్రాస్ హైకోర్టులో వాదనలు, జనవరి 9న తుది తీర్పు.
  • చెప్పిన తేదీన సినిమా విడుదలవుతుందా అని అభిమానుల్లో ఆందోళన.
  • భగవంత్ కేసరి కాపీ ఆరోపణలు.. తెలుగులో వసూళ్లపై ప్రభావం.

దళపతి విజయ్ అభిమానులకు షాకింగ్ న్యూస్! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’కు సెన్సార్ కష్టాలు చుట్టుముట్టాయి. సినిమా విడుదలపై ఉత్కంఠ. హైకోర్టు తీర్పు కోసం సినీ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మాస్ కథలో అసలు ట్విస్ట్ ఏంటి?

సెన్సార్ చిక్కులు: హైకోర్టులో వాదనలు!

విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ కు సెన్సార్ చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా సెన్సార్ ఇష్యూపై మద్రాస్ హైకోర్టులో బుధవారం వాదనలు జరగ్గా.. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 9కి రిజర్వ్ చేసింది. చిత్రయూనిట్ సినిమాను అదే రోజున రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసింది. ఇప్పుడు సెన్సార్ కష్టాలు రావడంతో.. చెప్పిన సమయానికి సినిమా విడుదలవుతుందా? లేదా? అని దళపతి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులు.. తెలుగులో బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరిని జన నాయగన్ లో మక్కీకి మక్కీ దించేశారని, కొంచెం కూడా సీన్స్ చేంజ్ చేయలేదని తిట్టిపోస్తున్నారు. దీంతో తెలుగు ఈ సినిమాకు వసూళ్లు రావడం కష్టంగానే కనిపిస్తోంది. అసలు తెలుగు వెర్షన్ విడుదల చేయకపోతే బెటరన్న వాదన కూడా ఉంది.

దళపతి అభిమానుల్లో ఉత్కంఠ: రిలీజ్ ఆగుతుందా?

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డిసెంబరులోనే సినిమాను సెన్సార్ కు పంపగా.. కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని, కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాలని చిత్రయూనిట్ కు సెన్సార్ బోర్డు సజెషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులన్నీ చేసి.. మళ్లీ రీసెండ్ చేయగా అక్కడి నుంచి స్పందన లేదని కేవీఎన్ ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు జరగ్గా.. చట్టం ప్రకారం తమకు నచ్చిన అధికారాలను వాడకుండా అడ్డుకుంటున్నట్లు అడిషినల్ సొలిసిటర్ జనరల్ సుందరేశన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే సినిమాలో సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు చేశారు కదా అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

భగవంత్ కేసరి పోలికలు: తెలుగులో కలెక్షన్ల కష్టం!

కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదిస్తూ.. సినిమాకు సంబంధించిన వ్యవహారాలను ఈ-సినీ ప్రమాణ్ పోర్టల్ ద్వారా తెలియజేయాలని, దరఖాస్తు, చెల్లింపులు, ఇతర సమాచారం మొత్తం దాని ద్వారానే జరుగుతుందన్నారు. కానీ సెన్సార్ బోర్డు వాళ్లు అలా వ్యవహరించలేదని, సినిమాకు సంబంధించిన విషయాలు తమ రాడర్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ఒకరికి మాత్రం అభ్యంతరాలు ఉన్నాయంటే అది 4:1రేషియోలో ఉందని, మళ్లీ దానిని రివ్యూకి ఎలా పంపుతారని పరాశరన్ ప్రశ్నించారు. ఇక్కడ చట్టప్రకారం సీబీఎఫ్సీ తన విధుల్ని మరిచిపోయినట్లు స్పష్టమవుతుందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ ఆశా తుది తీర్పును జనవరి 9న వెల్లడిస్తామని తెలిపారు. జనవరి ఉదయం తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో జన నాయగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా? ఆరోజున సినిమా విడుదలవుతుందా ?అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

జనవరి 9న హైకోర్టు తీర్పుతో ‘జన నాయగన్’ భవిష్యత్తు తేలనుంది. దళపతి అభిమానులు, తెలుగు సినీ లోకం మొత్తం ఈ తీర్పు కోసం ఎదురుచూస్తోంది. ఈ సెన్సార్ వివాదంపై మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.