|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movie: కొత్త మూవీ.. వారం లేటుగా ఓటీటీలో తెలుగు వెర్షన్ (‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’)

Updated: 27-08-2025, 9:28 PM
OTT Movie: కొత్త మూవీ.. వారం లేటుగా ఓటీటీలో తెలుగు వెర్షన్ ('జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ')

అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా ఓటీటీలో విడుదలైంది. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ వెర్షన్ల తర్వాత తెలుగు వెర్షన్ వారం రోజుల తర్వాత జీ5 లో అందుబాటులోకి వచ్చింది.

Key Points

1

అనుపమ పరమేశ్వరన్ నటించిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా జీ5లో స్ట్రీమింగ్.

2

మలయాళం, కన్నడం, తమిళం, హిందీ వెర్షన్ల తర్వాత తెలుగు వెర్షన్ విడుదల.

4

కోర్టు రూమ్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఆసక్తికర కథాంశం.

‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా కథాంశం

అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన ‘పరదా’.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో ‘కిష్కిందకాండ’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?

కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.

తెలుగు వెర్షన్ విడుదల వివరాలు

‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

జీ5 లో స్ట్రీమింగ్

చివరకు జానకి న్యాయం పొందుతుందా? ఈ కోర్టు డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. జీ5 లో ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.