
📌 Key Points
- జాన్వీ కపూర్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి ఫోర్న్ సైట్‌లో పెట్టారు.
- ఐటీ క్లాసులో అబ్బాయిలు ఫోటో చూడటం వలన తాను చాలా ఇబ్బంది పడ్డానని జాన్వీ తెలిపింది.
- డీప్ ఫేక్ ఫోటోల వల్ల సెలబ్రిటీలు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది.
- దేవర సినిమా ద్వారా జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి వెల్లడించింది. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఫోర్న్ సైట్‌లో పెట్టారని, దాని వల్ల తాను ఎంతో నరకం అనుభవించానని తెలిపింది.
ఫోర్న్ సైట్‌లో జాన్వీ కపూర్ ఫోటో
Janhvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం సౌత్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఒకరు. ప్రస్తుతం ఈమె పని బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా జాన్వీ కపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఇందులో భాగంగా ఆమె డీప్ ఫేక్ ఫోటోల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోల పై ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ సైతం తన డీప్ ఫోటోల గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇలాంటి సంఘటన జరిగిందని ఈమె గుర్తు చేసుకున్నారు. 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన ఫోటోని మార్ఫింగ్ చేసి ఒక ఫోర్న్ సైట్ లో పెట్టారని ఆ ఫోటో చూసి షాక్ అయ్యానని జాన్వీ తెలిపారు. అయితే ఆ చేదు సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని ఇప్పటికి తాను నరకం అనుభవిస్తున్నానంటూ ఈమె తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.
డీప్ ఫేక్ ఫోటోలపై జాన్వీ ఆవేదన
తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే మా ఐటీ క్లాసులో అబ్బాయిలు సరదాగా పలు సైట్లు ఓపెన్ చేసేవారు .అలా ఓపెన్ చేసినప్పుడు నా ఫోటో కనిపించిందని ఆ క్షణం తాను ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యానని తెలిపారు. అది డీప్ ఫేక్ ఫోటోనా లేక మార్ఫింగ్ ఫోటోనా తెలియదు కానీ ఫోర్న్ సైట్ లో నా ఫోటో కనిపించేసరికి సెలబ్రిటీల పిల్లలుగా పుట్టినందుకు మేము చెల్లించుకున్న మూల్యం ఇదే అని తనకు తాను సర్ది చెప్పుకున్నానని జాన్వీ కపూర్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన డీప్ ఫేక్ వీడియో గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్…
సౌత్ ఇండస్ట్రీకి జాన్వీ కపూర్
ఇటీవల కాలంలో ఎఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వీటి కారణంగా తనకు మనశ్శాంతి లేకుండా పోతుందని తెలిపారు . ఇలా ఏఐ ఫోటోల గురించి అలాగే డీప్ ఫేక్ ఫోటోల గురించి ఈమె తన ఆవేదన మొత్తం బయట పెడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈమె దేవర సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్న పెద్ది సినిమా(Peddi Movie)లో కూడా జాన్వీ కపూర్ నటిస్తున్నారు ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది.
డీప్ ఫేక్ ఫోటోల వల్ల సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.


