|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా పేరుతో బతికేస్తున్నారా? యూట్యూబర్లపై జాన్వీ కపూర్ ఫైర్!

Published: 03-03-2026, 8:35 AM
నా పేరుతో బతికేస్తున్నారా? యూట్యూబర్లపై జాన్వీ కపూర్ ఫైర్!
  • జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
  • సోషల్ మీడియాలో తన పేరును వాడుకుంటున్న వారిపై జాన్వీ ఫైర్ అయ్యారు.
  • నెటిజన్లు సెలబ్రిటీల పేర్లను వాడుకొని డబ్బు సంపాదిస్తున్నారని జాన్వీ ఆరోపించారు.
  • నెగెటివిటీ తీవ్రంగా ఉన్నప్పుడు బాధ కలుగుతుందని జాన్వీ అన్నారు.

శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్న ఆమె, సోషల్ మీడియాలో తన పేరును వాడుకుంటున్న వారిపై తాజాగా స్పందించారు. వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవర సినిమాతో తెలుగు తెరకు జాన్వీ

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ అందరికీ ఎంతో సుపరిచితమే ఇన్ని రోజులు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల సౌత్ సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నారు. దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ జోడిగా జాన్వీ సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన విమర్శలపై నెగటివ్ కామెంట్లపై కూడా స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సోషల్ మీడియా నెగిటివిటీ గురించి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్స్ ఇంస్టాగ్రామ్స్ ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి లైక్స్, వ్యూస్ కావాలి అందుకే మాలాంటి సెలబ్రెటీల పేర్లను వాడుకొని వారికి నచ్చిన కంటెంట్ క్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు.

సోషల్ మీడియాపై జాన్వీ కపూర్ ఆగ్రహం

మా పేర్లను ఉపయోగించుకొని మమ్మల్ని ఒక బలి పశువులా వాడుకొని వారికంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నారని తెలియచేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై మనం స్పందించాల్సిన పనిలేదు. మన గురించి ఎవరైతే వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారో వారు కేవలం వారి బిజినెస్ కోసమే మన గురించి మాట్లాడుతున్నారని అందుకే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై తాను పెద్దగా స్పందించనని తెలిపారు.

ఇలా నెగిటివిటిపై మనం మౌనంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు నెగెటివిటీ తారాస్థాయికి చేరుకుంటుంది ఆ క్షణం చాలా బాధ కలుగుతుందని తెలిపారు. గత కొద్దిరోజులుగా జాన్వీ కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ విషయంలో జరుగుతున్న నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని ఈమె ఇలాంటి కామెంట్లు చేశారని స్పష్టం అవుతుంది. ఇక ఇటీవల ఎంతో మంది ఇలా సెలబ్రిటీల పేరుతో పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా తమ పట్ల వస్తున్న విమర్శల గురించి సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు స్పందించిన వారి గురించి మాత్రం నెగిటివిటీ ఆగదనే చెప్పాలి. దీంతో సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.

నెగెటివిటీపై జాన్వీ స్పందన

సెలబ్రిటీల గురించి వస్తున్న విమర్శలపై వారు స్పందించినా నెగిటివిటీ ఆగదని జాన్వీ అభిప్రాయపడ్డారు. అందుకే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నానని ఆమె అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.