|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాన్వి కపూర్ కల నెరవేరింది! రణబీర్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్.. ఇక అంతే!

Published: 22-02-2026, 12:05 AM
జాన్వి కపూర్ కల నెరవేరింది! రణబీర్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్.. ఇక అంతే!
  • జాన్వి కపూర్ త్వరలో రణబీర్ కపూర్ సరసన నటించే అవకాశం ఉంది.
  • దర్శకుడు మోహిత్ సూరి జాన్వికి తన సినిమాలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు.
  • రణబీర్ కపూర్ గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ లవ్ స్టోరీలో నటించనున్నాడు.
  • జాన్వి కపూర్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో నటిస్తోంది.

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ త్వరలో రణబీర్ కపూర్ సరసన నటించే అవకాశం ఉంది. దర్శకుడు మోహిత్ సూరి ఆమెకు తన సినిమాలో అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రణబీర్‌తో జాన్వి రొమాన్స్?

Janvikapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తన టాలెంట్ తో ఒక్కో సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈమధ్య బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉంది.. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఆ మూవీ లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీలో నటిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ ఆమెను వరించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ కైనా కూడా తమకు నచ్చిన ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ల ఉంటారు. అలాగే బాలీవుడ్ ముద్దుగా మా జాన్వి కపూర్ కి కూడా స్టార్ హీరో ఫేవరెట్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన మరెవరో కాదు రణబీర్ కపూర్. చాలా కాలంగా రణబీర్ కపూర్ సరసన నటించాలని జాన్వీ భావిస్తోంది. ఓపెన్ గానే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పింది.. కానీ బాలీవుడ్ చిత్ర దర్శకులు ఎవరు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఆమె ఆసక్తిని మోహిత్ సూరి గమనించాడు. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వార్త నిజం అయితే బాగుండు అని జాన్వికపూర్ అభిమానులు కోరుకుంటున్నారు..

డైరెక్టర్ మోహిత్ సూరి నిర్ణయం

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతంలో యానిమల్ మూవీతో బిగ్గెస్ట్ హేట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన వరుసగా ఒక్కో సినిమాని లైన్లో పెట్టుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్ హీరోగా ఓ గ్యాంగ్ స్టార్ మ్యూజికల్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.. డైరెక్టర్ మోహిత్ సూరి, రణబీర్ కపూర్ కాంబోలో ఈ మూవీ రాబోతుంది. ఇందులో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అని డైరెక్టర్ ఆలోచించగా జాన్వీ కపూర్ గుర్తుకువచ్చింది.. ఇప్పటికే స్టోరీ ని వినిపించి ఆమెను ఫిక్స్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి జాన్వి పాప కోరిక ఇన్నాళ్లకు తీరబోతుందని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాబోతుంది.. జాన్వీ కపూర్సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తుంది.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…

మొత్తానికి జాన్వి కపూర్ కోరిక నెరవేరుతున్నట్టు ఉంది. రణబీర్ కపూర్ సరసన నటించే అవకాశం వస్తే ఆమె కెరీర్ మరింత ముందుకు సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.