
📌 Key Points
- రష్మిక మందన్న తన కెరీర్లో ధనుష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉందని తెలిపింది.
- ఈ హీరోలతో తనకు మంచి సింక్ ఉంటుందని, వారితో మళ్లీ నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని రష్మిక పేర్కొంది.
- పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది.
- విజయ్ దేవరకొండతో ప్రేమ వ్యవహారం, త్వరలో వీరి వివాహం జరగనుందని సమాచారం.
టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న రష్మిక మందన్న, ఇటీవల తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మిక కామెంట్స్ వైరల్
Rashmika Mandanna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. గత ఏడాది సుమారు ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా రష్మిక 2025వ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా జపాన్ లో పుష్ప 2 విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఈమె బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈమె తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆన్ స్క్రీన్ పై ఏ హీరోతో కెమిస్ట్రీ బాగుంటుందనిపిస్తుంది అంటూ ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ..
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై రష్మిక
తన సినీ కెరియర్లో అద్భుతమైన హీరోలతో పని చేశానని తెలియజేశారు. ముఖ్యంగా ధనుష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హీరోలతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని, మళ్లీ మళ్లీ వీరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు. ఈ హీరోలతో కలిసి నటించేటప్పుడు తనకు మంచి సింక్ ఉంటుందని, మరోసారి ఈ హీరోలతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి మరోసారి ఈ హీరోలతో కలిసి నటించే అవకాశం ఈ ముద్దగుమ్మకు వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటించిన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల ధనుష్ తో కలిసి కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నటుడు విజయ్ దేవరకొండతో ఈమె రెండు సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే రష్మిక , విజయ్ మధ్య ప్రేమ చిగురించడం, ఈ ప్రేమ పెళ్లిగా మారబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో వివాహంపై స్పందన
మొత్తానికి రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


