
📌 Key Points
- జాన్వీ కపూర్ 9 ఏళ్ల కెరీర్‌లో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టి షాక్ ఇచ్చింది!
- 29 ఏళ్ల వయసులోనే భారీ రెమ్యునరేషన్‌తో టాలీవుడ్‌ను ఏలేస్తోంది ఈ స్టార్ హీరోయిన్.
- దేవర, పెద్ది సినిమాలకు కోట్లు, అల్లు అర్జున్ రాకాకు ఏకంగా 10 కోట్లు డిమాండ్!
- ముంబై, చెన్నైలో లగ్జరీ ఇళ్లు, సోషల్ మీడియా ద్వారా లక్షల్లో ఆదాయం జాన్వీ సొంతం.
ఫిల్మ్ ఇండస్ట్రీలో అదృష్టం, టాలెంట్ కలగలిస్తేనే స్టార్‌గా ఎదగడం సాధ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని అప్లై చేసి, కేవలం 9 ఏళ్ల కెరీర్‌లో వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి, 29 ఏళ్లకే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? సంచలన వివరాలు మీకోసం!
జాన్వీ కపూర్: కెరీర్, క్రేజ్, కోట్లు!
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం లేకపోతే పరిశ్రమలో ఎదగలేరు అని.. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో వెల్లడించారు. లక్కు లేకపోతే స్టార్ వారసులు కూడా ఇండస్ట్రీలో నిలబడలేరు. అలా లక్కుతోనే స్టార్ గా మారింది ఓ యంగ్ హీరోయిన్. తల్లి, తండ్రి వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. పెద్దగా హిట్లే లేకపోయినా వరసుగా అవకాశాలు సాధిస్తోంది.
శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. కానీ కెరీర్ బిగినింగ్ లో ఆమె కమర్షియల్ సినిమాలేవి చేయలేదు. ఎక్కువగా కథాబలం ఉన్న వాటినే ఎంచుకుని, నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. చిన్న వయసులోనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన జాన్వీ కపూర్.. నటిగా మంచి పేరును మాత్రం సాధించింది.
ఇక సౌత్ లో మాత్రం వరుసగా కమర్షియల్ సినిమాలకే జై కొట్టింది జాన్వీ. ఎన్టీఆర్ జోడీగా తెలుగులో ఆమె నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుంతం రామ్ చరణ సరసన పెద్ది సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ నుంచి వరుస సినిమాలతో పాన్ ఇండియాను టార్గెట్ చేసింది జాన్వీ కపూర్.
దేవర నుంచి రాకా వరకు: జాన్వీ డిమాండ్ పెరుగుతోంది!
9 ఏళ్ల కెరీర్ లో జాన్వీ కపూర్ సాధించిన హిట్లు చాలా తక్కువ. కానీ ఈ హీరోయిన్ క్రేజ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనేఉంది. జాన్వీ కపూర్ గ్లామర్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అవకాశాల విషయంలో కూడా అందరికంటే ముందుంది జాన్వీ. సౌత్ లో జాన్వీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ సినిమాల విషయంలో సెలక్టీవ్ గా వెళ్తోంది స్టార్ బ్యూటీ. ఏమాత్రం తొందరపడకుండా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల, పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
29 ఏళ్ల వయసులో దాదాపు 100 కోట్ల ఆస్తిని కూడబెట్టిందట జాన్వీ కపూర్. సినిమాకు 5 నుంచి 10 కోట్లు వసూలు చేస్తోంది. దేవర సినిమాకు 5 కోట్లు, పెద్ది కోసం 7 కోట్లు తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. అల్లు అర్జున్ రాకా కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ముంబయ్ లో రెండు ఇళ్లు, చెన్నైలో శ్రీదేవి నుంచి వచ్చిన వారసత్వంపు బంగ్లాతో పాటు మరికొన్ని ఆసులు జాన్వీ పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది.
లగ్జరీ లైఫ్ స్టైల్: ఆస్తుల వివరాలు లీక్!
సినిమాలు , కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తోన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియా ద్వారా కూడా లక్షల్లో ఆదాయం గడిస్తోంది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. ఆమె ఖాతాలో లక్షలు పడుతున్నాయి. ఇన్ స్టాలో జాన్వీ కి దాదాపు 2 కోట్ల 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జాన్వీ కపూర్ ఫో ఇన్ స్టాలో టోషూట్ కోసం ఎదురుచూసే అభిమానులు ఎందరో.
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది జాన్వీ. టాలీవుడ్ నుంచి ఆమె నటించిన పెద్ది రిలీజ్ కు రెడీగా ఉంది. దీనితో పాటు అల్లు అర్జున్ రాకాలో నటిస్తోంది. మరో వైపు ఎన్టీఆర్ జోడీగా దేవర 2 లో కూడా జాన్వీ నటించాల్సి ఉంది. అటు తమిళంలో కూడా సూర్య సరసన జాన్వీని తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. శీదేవి వారసురాలిగా జాన్వీని సౌత్ ఆడియన్స్ ఆదరిస్తున్నారు.
జాన్వీ కపూర్ కెరీర్, ఆమె సాధించిన విజయాలు నిజంగా స్ఫూర్తిదాయకం. టాలీవుడ్‌లో ఆమె ప్రస్థానం మరింత ఉజ్వలంగా సాగాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!


