
జీ5 ఓటీటీలో కొత్తగా విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘జనావర్’. తల లేని మొండెం, వరుస హత్యలు, ఓ బలమైన కుల వివక్ష సందేశంతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్ రివ్యూ, కథాంశం, నటీనటుల నటన, ప్లస్సులు మైనస్సులు ఇక్కడ చూడండి.
Key Points
జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 26న విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ 'జనావర్ ది బీస్ట్ వితిన్'.
తల లేని మొండెం, గోల్డ్ రాబరీ, మిస్సింగ్ కేసుల చుట్టూ కథ నడుస్తుంది.
హత్యల మిస్టరీతో పాటు కుల వివక్షను ప్రస్తావించిన వెబ్ సిరీస్ ఇది.
భువన్ అరోరా, బద్రుల్ ఇస్లాం, వినోద్ సూర్యవంశీ ప్రధాన పాత్రల్లో నటించారు.
జనావర్ కథాంశం: హత్యలు, ట్విస్టులు
తారాగణం: భువన్ అరోరా, వినోద్ సూర్యవంశీ, బద్రుల్ ఇస్లాం, అతుల్ కాలే, భగవాన్ తివారీ, ఎషికా డే, వైభవ్ యశ్వీర్, దీక్షా సోనాల్కర్ థామ్, నీతి కౌశిక్
దర్శకత్వం: సచీంద్ర వాట్స్
జీ5 ఓటీటీలోకి కొత్త సిరీస్ వచ్చేసింది. హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘జనావర్ ది బీస్ట్ వితిన్’ సిరీస్ నిన్న (సెప్టెంబర్ 26) డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అడుగుపెట్టింది. తలలు లేని మొండెం, గోల్డ్ రాబరీ, మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది ఈ వెబ్ సిరీస్. ఇందులో ఓ బలమైన సందేశం కూడా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో కుల వివక్షను కళ్లకు కట్టినట్లు చూపించారు.
సిరీస్ నటీనటుల నటన
జీ5 లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘జనావర్’. ఇది ఓ పోలీస్ సిస్టమ్ కు సంబంధించిన డ్రామా స్టోరీ. ఇది కుల వివక్షను సున్నితమైన పద్ధతిలో ప్రశ్నిస్తుంది. ‘ఒక వ్యక్తి సమాజం కోరుకునే జంతువుగా మారడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటాడు’ అనే ప్రశ్నతో సాగుతుంది. ప్రతి మలుపులో కులం వారీగా విభజించబడిన చాండ్ అనే చిన్న పట్టణంలో జనావర్ స్టోరీని సెట్ చేశారు.
సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ (భువన్ అరోరా) కూడా తన విధిని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కుల వివక్షను నావిగేట్ చేస్తాడు. అతను చిన్న పట్టణాన్ని షేక్ చేసే మర్డర్ కేసులు విచారిస్తాడు. తల లేని మొండెం వదిలి వెళ్తాడు హంతకుడు. అదే సమయంలో గర్భవతి అయిన తన భార్య కోసం అక్కడ ఉండటానికి ప్రయత్నిస్తాడు హేమంత్. మరి ఆ హత్యలు ఎవరు చేశారు? మధ్యలో బంగారం దొంగతనం ఏంటీ? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ప్లస్సులు, మైనస్సులు: జనావర్ సిరీస్ విశ్లేషణ
సెప్టెంబర్ 26న జీ5 ఓటీటీ లోకి వచ్చిన జనావర్ సిరీస్ లో ఏడు ఎపిసోడ్లున్నాయి. ఇప్పుడు ఇది హిందీలో మాత్రం అందుబాటులో ఉంది. సిరీస్ మధ్యలో మంచి ట్విస్ట్ లు ఉత్కంఠ కలిగిస్తాయి. థ్రిల్ ను పంచుతాయి. మర్డర్ మిస్టరీ చుట్టూ అ్లలుకున్న కుల వివక్షను చాటే కథ ఇది. భువన్ అరోరా ఫస్ట్ టైమ్ మెయిన్ లీడ్ రోల్ చేశాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు.
బద్రుల్ ఇస్లాం, వినోద్ సూర్యవంశీ కూడా సిరీస్ లో తమ ముద్ర వేశారు. ఇద్దరూ కుల స్పెక్ట్రం వ్యతిరేకంగా గొప్పగా నటించారు. సిరీస్ పరంగా చూస్తే జనావర్ ఓ మర్డర్ మిస్టరీనే. కానీ మధ్యలో కుల వివక్షను చూపించాలనే ప్రయత్నం కాస్త బెడిసి కొట్టినట్లే అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కథనం మరింత గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓ సారి చూసే సిరీస్ జనావర్.
మొత్తం మీద ‘జనావర్’ ఒక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. కుల వివక్ష అంశాన్ని చర్చించినప్పటికీ, కథనం కొన్నిచోట్ల సాగదీతగా అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు ఒక్కసారి చూడదగిన సిరీస్ ఇది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.


