|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీదేవిని చివరిగా కలిసిన జయమాలిని: ఆ గెట్ టుగెదర్ వెనుక దాగున్న విషాదం!

Published: 25-12-2025, 3:46 PM
శ్రీదేవిని చివరిగా కలిసిన జయమాలిని: ఆ గెట్ టుగెదర్ వెనుక దాగున్న విషాదం!
  • కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజాలతో సరదా సంఘటనలు, డ్యాన్స్ గురించి జయమాలిని.
  • శ్రీదేవి మరణానికి ఆరు నెలల ముందు జరిగిన గెట్ టుగెదర్, దాని వెనుక విషాదం.
  • సిల్క్ స్మిత పెళ్లి, ఆమె ఒంటరి మరణం పట్ల జయమాలిని తీవ్ర ఆవేదన.
  • ఎంజీఆర్‌తో తన అనుబంధం, ఆయన ఆశీస్సుల గురించి భావోద్వేగంగా పంచుకున్నారు.

ప్రముఖ నటి జయమాలిని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, దిగ్గజ నటులతో అనుబంధంపై భావోద్వేగంగా మాట్లాడారు. శ్రీదేవి మరణానికి ముందు జరిగిన గెట్ టుగెదర్, సిల్క్ స్మిత విషాదం, కృష్ణ, ఎంజీఆర్ లతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ వివరాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

జయమాలిని సినీ ప్రస్థానం

ప్రముఖ నటి జయమాలిని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, అలాగే దిగ్గజ నటీనటులతో తనకున్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తాను ఫాస్ట్‌గా డ్యాన్స్ చేసిన ప్రతీసారి.. హీరో కృష్ణ.. ‘ఈ పిల్ల చిలకలా గెంతుతోంది, నా వల్ల కాదు’ అని అనేవారని గుర్తు చేసుకుంది. శోభన్ బాబు లాంటివారు కూడా తనతో సరదాగా ఉండేవారని చెప్పింది.

ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటుడితో తనకున్న అనుబంధాన్ని నటి జయమాలిని గుర్తు చేసుకుంది. ఓసారి ఎంజీఆర్ పిక్చర్‌కు పూజ కోసం పిలిచినప్పుడు, ఆయన గురించి పెద్దగా తెలియక తాను రాను అనేశానని, తన తల్లిదండ్రులు వెళ్లినప్పుడు ‘జయ రాలేదా?’ అని ఎంజీఆర్ అడిగారని వాళ్లు చెప్పినట్టుగా తెలిపింది. ఎంజీఆర్ తనతో నేరుగా నటించనప్పటికీ, తన నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చి, ఒక గంట పాటు చూసి, ఆశీర్వదించారని, అది తనకు చాలని చెప్పుకొచ్చింది.

శ్రీదేవి, సిల్క్ స్మితతో ఆమె బంధం

తన సినీ జీవితం ఎప్పుడూ ఆనందంగా సాగిందని, డ్రెస్సులు, ట్రోల్స్, పాత్రల విషయంలో తనకెప్పుడూ ఎలాంటి కష్టం రాలేదని జయమాలిని పేర్కొంది. ‘ఎవరు అడిగినా కూడా చెప్తారు, కరెక్ట్ టైంకి ఆ అమ్మాయి వస్తుంది, తన పని చేస్తుంది, సైలెంట్ గా వెళ్ళిపోతుంది, మాకేం ఇబ్బంది లేదు’ అని తన గురించి అందరూ చెప్పేవారని వివరించింది.

‘సిల్క్ స్మిత తన పెళ్లి సమయంలో బొకేతో వచ్చి కారులో కూర్చుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత గురించి బాధపడతానని.. అందరూ ఉన్నా.. ఆమె ఒంటరి అయి చనిపోయిందని’ బాధపడింది జయమాలిని. ఇక తన వివాహం పెద్దలు నిశ్చయించిందని చెప్పింది. 1994లో తిరుపతిలో జరిగింది. 1995లో బాబు పుట్టాడని తెలిపింది.

దిగ్గజ నటులతో జయమాలిని జ్ఞాపకాలు

తనను కోడలిగా స్వీకరించేందుకు మొదట మా అత్త ఇష్టపడకపోయినా, నా ప్రవర్తన, గుడికి తరచూ వెళ్లడం లాంటి వాటిని చూసి.. ఆమె తనను ఇష్టపడ్డారని జయమాలిని తెలిపింది. ఒకసారి అందరూ కలిసి గెట్-టుగెదర్‌ జరుపుకోవాలని అనుకున్నాం.. హీరోయిన్ శారద.. శ్రీదేవిని కూడా పిలవాలని అనడం ఆమె రావడం జరిగింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆమె మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పింది. కృష్ణ, విజయనిర్మల దంపతుల మరణం కూడా తనకు చాలా బాధ కలిగించిందని తెలిపింది.

జయమాలిని పంచుకున్న ఈ జ్ఞాపకాలు సినీ అభిమానులకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. దిగ్గజ నటుల వ్యక్తిగత కోణాలను, వారి మధ్య ఉన్న అనుబంధాలను ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేసింది. గత తరం సినీ విశేషాలను మరోసారి గుర్తుచేసుకునేలా చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.