
📌 Key Points
- జియో రూ.349 ప్లాన్‌లో గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
- ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచితం.
- రెండు ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా అందిస్తాయి.
- జియో ప్లాన్ ఎయిర్‌టెల్ కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
జియో మరియు ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌ల వివరాలు మరియు ఆఫర్లను ఇప్పుడు చూద్దాం.
ఎయిర్‌టెల్ రూ. 398 ప్లాన్ వివరాలు
Jio-Airtel Plans : రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ఏదైనా ఓకే.. 2026లో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం అందుబాటులో ఉన్నాయి. ఏ టెల్కో ఆఫర్ బెటర్? బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
Reliance Jio or Bharti Airtel
Jio-Airtel Plans : జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో డేటా కావాలంటే ఇది మీకోసమే. ఈ టెల్కోలు పోర్ట్‌ఫోలియోలను 2GB రోజువారీ డేటా ప్లాన్‌లతో అప్‌డేట్ చేశాయి. జియో ప్లాన్ రూ. 349కి వస్తుండగా, ఎయిర్‌టెల్ పోటీ ప్లాన్ ధర రూ. 398కి వస్తోంది.
ఈ 2 ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. అదనపు బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. జియో కస్టమర్లకు రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రోను ఫ్రీగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం యాప్స్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
జియో రూ. 349 ప్లాన్ బెనిఫిట్స్
ఎయిర్‌టెల్ రూ. 398 ప్లాన్ : భారతీ ఎయిర్‌టెల్ రూ. 398 రీఛార్జ్ ప్లాన్ హై-స్పీడ్ ఇంటర్నెట్, ప్రొఫెషనల్ టూల్స్ వాడేవారికి బెస్ట్. ఈ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 12 నెలల పాటు సుమారు రూ. 4వేలు విలువైన ఫ్రీ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం అందిస్తుంది.
జియో-హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ 28 రోజుల వరకు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటా, స్పామ్ కాల్స్, మెసేజ్ నుంచి అలర్ట్స్, ప్రతి నెలా ఫ్రీ హలో ట్యూన్ పొందుతారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ క్వాలిటీపై ఆధారపడే వారికి ఈ ప్లాన్ బెస్ట్.
Read Also : Advance Tax : అడ్వాన్స్ టాక్స్ ఇంకా కట్టలేదా? ఈరోజే లాస్ట్ డేట్.. ఆదివారం చెల్లించవచ్చా? ఎవరు కట్టాలి? రూల్స్ తెలుసుకోండి!
జియో రూ. 349 ప్లాన్ : రిలయన్స్ జియో రూ. 349 ప్లాన్‌తో మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఎయిర్‌టెల్ కన్నా రూ.49 చౌకైనది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు మొత్తం 56GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ ఏఐ ఆఫర్లలో కూడా వస్తుంది.
ప్లాన్‌ల మధ్య వ్యత్యాసం ఏమిటి?
జియో ఈ ప్లాన్‌తో గూగుల్ జెమిని ప్రోకి సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. సపరేటుగా తీసుకుంటే ఏడాదికి రూ.35,100 చెల్లించాలి. జియో-హాట్ స్టార్ మొబైల్, టీవీ సర్వీసుకు 3 నెలల పాటు పొందవచ్చు. 50GB క్లౌడ్ స్టోరేజ్‌కూడా పొందవచ్చు. ఈ జియో ప్లాన్ ఎయిర్‌టెల్ కన్నా చాలా చౌకైనది.
అడ్వాన్స్ రీఛార్జ్, అన్ లిమిటెడ్ 5G డేటా : 2026లో డేటాకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. జియో, ఎయిర్ టెల్ ఈ ప్లాన్లతో అన్ లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి. 5G కవరేజ్ ప్రాంతంలో ఉండి మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే రోజువారీ లిమిట్స్ లేకుండా ఇంటర్నెట్‌ను పొందవచ్చు.
జియో హాట్‌స్టార్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. రెండు లేదా మూడు నెలలు జియో-హాట్‌స్టార్ కావాలంటే ప్రస్తుత 28 రోజుల వ్యాలిడిటీ గడువుకు కనీసం 2 రోజుల ముందు మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే.. మీ ప్రస్తుత ప్లాన్ పూర్తిగా అయ్యాకే మీ కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. OTT కంటెంట్ మిస్ కాకుండా చూడొచ్చు.
జియో, ఎయిర్‌టెల్ రెండు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు చౌకైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకుని, డేటా మరియు అదనపు ప్రయోజనాలను పొందండి.


