
కన్నడ స్టార్ కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘జూనియర్’ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 30న విడుదలైన ఈ ఎమోషనల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందింది. ‘వైరల్ వయ్యారి’ పాటతో అలరించిన ఈ చిత్రాన్ని ఆహాలో చూసి ఆనందించండి.
Key Points
కన్నడ స్టార్ కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా జూనియర్ మూవీలో జెనీలియా కీలక పాత్రలో నటించింది.
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చి పాజిటీవ్ రెస్పాన్స్ పొందింది.
కిరీటి, శ్రీలీల డాన్స్‌తో 'వైరల్ వయ్యారి' సాంగ్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.
దసరా కానుకగా సెప్టెంబర్ 30 నుండి ఆహా ఓటీటీలో జూనియర్ స్ట్రీమింగ్ అవుతోంది.
జూనియర్ మూవీ: కథ, నటీనటులు
Junior On Aha: కన్నడ స్టార్ గాలి కిరీటి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జూనియర్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా కీ రోల్ చేసింది. కాలేజీ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించాడు. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇక సినిమాలో కిరీటి, శ్రీలీల డాన్స్ తో (Junior On Aha)కుమ్మేసిన “వైరల్ వయ్యారి” అనే సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ పాట. మరీ ముఖ్యంగా హీరో కిరీటి వేసిన డాన్స్ మూవ్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
బాక్సాఫీస్ విజయం, వైరల్ వయ్యారి సాంగ్
Rishab Shetty: హైదరాబాద్ లో వివాదం.. విజయవాడలో వివరణ.. తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా?
ఆహాలో స్ట్రీమింగ్: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఇక ఈ మధ్యే థియేట్రికల్ రన్ ముగించుకున్న జూనియర్ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. దసరా కానుకగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఆహా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. దసరా సెలవులు కావడంతో ఈ సినిమాకు ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి లేట్ ఎందుకు వీలుంటే మీరు కూడా జూనియర్ సినిమాను ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
థియేటర్లలో విజయవంతమైన జూనియర్ మూవీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. దసరా సెలవుల్లో ఈ ఎమోషనల్ కాలేజీ డ్రామాను ఆహాలో వీక్షించి ఆనందించండి. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చే అవకాశం ఉంది.


