
నటి జ్యోతి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో జన్మలో ఆయనే తన భర్త కావాలని కోరిన జ్యోతి, తన కొడుకును చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Key Points
నటి జ్యోతి 'పెళ్ళాం ఊరెళితే' సినిమాతో స్టార్ గా గుర్తింపు పొందింది.
బిగ్ బాస్ తో రీ-ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది.
పవన్ కళ్యాణ్ ని మరో జన్మలో భర్తగా పొందాలని జ్యోతి కోరుకుంది.
పవన్ కళ్యాణ్ తన కొడుకును చూసి "ఏంటి అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడు" అని అన్నారు.
నటి జ్యోతి రీ-ఎంట్రీ, సినీ ప్రస్థానం
Jyothi : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన జ్యోతి పెళ్ళాం ఊరెళితే సినిమాతో స్టార్ గా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమైనా మళ్ళీ బిగ్ బాస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అడపాదడపా సినిమాలు చేస్తుంది.(Jyothi)
చాన్నాళ్లకు జ్యోతి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ పై జ్యోతి ఆసక్తికర వ్యాఖ్యలు
జ్యోతి మాట్లాడుతూ.. అసలు ఆయన పాలిటిక్స్ కి వెళ్తారు, ఇలా డిప్యూటీ సీఎం అవుతారు అని ఊహించలేదు. ఆయనతో కలిసి గుడుంబా శంకర్ సినిమా చేశాను. ఆ సినిమా చేసేటప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి ఆయనతో. సరదాగా ఆట పట్టించేవాళ్ళు. రీసెంట్ గా ఆయన్ని కలిసాను. మా బాబుని పరిచయం చేస్తే నీ కొడుకా.. ఏంటి అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడు అని అన్నారు. ఆయన నా ఫేవరేట్ స్టార్. ఆయన ఒక లీడర్. ఆయన చేసే హార్డ్ వర్క్ ని అభినందించాలి. నేను జనసేన పార్టీనే. ఆయన ఏ చిన్న ప్రాంతానికి అయినా వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకొని దానిపై వర్క్ చేస్తారు. ఆయన అంటే నాకు క్రష్. ఇంకో జన్మ ఉంటే ఆయన్ని హస్బెండ్ గా రావాలని కోరుకుంటా అని అంది. దీంతో జ్యోతి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పవన్ తన కొడుకు గురించి ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ పై జ్యోతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన నాయకత్వాన్ని, కష్టాన్ని అభినందిస్తూ, జనసేన పార్టీకి తన మద్దతును ప్రకటించింది. జ్యోతి అభిప్రాయాలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


