|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘క’ చిత్రానికి దక్కిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డ్‌

Published: 02-05-2025, 12:49 AM
'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్‌ ఫాల్కే' అవార్డ్‌

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ విజయం తెలుగు సినిమాకు గొప్ప గౌరవం. పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

Key Points

1

కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

2

'క' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది

4

అమెజాన్ ప్రైమ్ లో 'క' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది

‘క’ సినిమా విజయం

టాలీవుడ్‌ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన‘క’ (KA) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’(Dada Saheb Phalke Film Festival)లో ఉత్తమ చిత్రంగా ‘క’ అవార్డు దక్కించుకుంది. ఒక తెలుగు సినిమాకు  ఈ అవార్డ్‌ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త దర్శకులు సుజిత్, సందీప్‌ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాదిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు.

పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంగా ‘క’ ప్రేక్షకులను అలరించింది. పార్ట్‌ 1 విజయం సాధించడంతో పార్ట్‌ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.  ‘క’ చిత్రం  అమెజాన్‌ ప్రైమ్‌లో  స్ట్రీమింగ్‌ అవుతుంది. డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్‌ తెలుగు సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సైకలాజికల్‌ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

‘క’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్‌ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్‌ మ్యాన్‌ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్‌ కోసం రామ్‌(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్‌ మాస్టర్‌ రామారావు(అచ్చుత్‌ కుమార్‌) అనుమతితో పోస్ట్‌ మ్యాన్‌ అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.

సినిమా కథాంశం

అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్‌ అవుతుంటారు. వారిని కిడ్నాప్‌ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్‌ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్‌ షేక్‌ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్‌) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చివరగా, ‘క’ సినిమాకు దక్కిన ఈ అరుదైన గౌరవం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. సినిమా విజయం సాధించడంతో పాటు, అవార్డులు అందుకోవడం సంతోషదాయకం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.