|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`కాంత` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌, ప్లాట్‌ఫామ్‌.. థియేటర్లో డిజాస్టర్, మరి ఓటీటీలో ఆడుతుందా?

Published: 29-11-2025, 10:04 PM
`కాంత` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌, ప్లాట్‌ఫామ్‌.. థియేటర్లో డిజాస్టర్, మరి ఓటీటీలో ఆడుతుందా?

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘కాంత’ చిత్రం థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా సత్తా చాటకపోయినా, నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌ 12న స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'కాంత'.

2

ఈ నెల 14న విడుదలైన 'కాంత' థియేటర్లలో ఆకట్టుకోవడంలో విఫలమైంది.

4

డిసెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌లో 'కాంత' ఓటీటీ స్ట్రీమింగ్‌ కానుంది.

‘కాంత’ థియేట్రికల్ పరాజయం

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్ ఇప్పుడు తెలుగు హీరో అయ్యాడు. ఆయన వరుసగా తెలుగు మూవీస్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనే కాదు, తమిళంలోనూ మూవీస్‌ చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. చాలా వరకు పాన్‌ ఇండియా చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన `కాంత` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, రానా, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు.

తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని `కాంత` పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ నెల 14న విడుదలైంది. ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. 1950 బ్యాక్‌ డ్రాప్‌లో అప్పటి కోలీవుడ్‌ హీరో, దర్శకుడికి మధ్య జరిగిన ఈగో సమస్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.

ఓటీటీలో ‘కాంత’ ఎప్పుడు? ఎక్కడ?

అయితే నటీనటులు పర్‌ఫెర్మెన్స్ పరంగా ప్రశంసలందుకున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ తన నటనతో విశ్వరూపం చూపించారు. మహదేవన్‌ పాత్రలో ఇరగదీశారు. అంతేకాదు ఇందులో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే నటన కూడా మెప్పిస్తుంది. ఆమె నటన ఆడియెన్స్ కి సర్‌ప్రైజ్‌ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం విడుదలై వారం రోజులు అవుతుంది. దాదాపు రూ.20కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. కేవలం 40-50శాతం మాత్రమే రికవరీ చేయగలిగిందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. దీంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

దుల్కర్‌ సల్మాన్‌ నటనకు ప్రశంసలు

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన `కాంత` మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అన్ని సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే `కాంత` కూడా నెలలోపే ఓటీటీలోకి రాబోతుందని, డిసెంబర్‌ 12న నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కాబోతుందని సమాచారం. థియేటర్లలో సత్తా చాటని ఈ మూవీ ఓటీటీలో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

‘కాంత’ థియేటర్లలో పరాజయం పాలైనా, దుల్కర్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. డిసెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాంత’ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.