
తెలుగు సినిమా రంగంలో ఒక లెజెండ్ అయిన కైకాల సత్యనారాయణ నటించిన ఘటోత్కచుడు సినిమాలోని ‘అమ్మ ప్రేమ చెప్పే అందాల అపరంజి బొమ్మ’ అనే సూపర్ హిట్ పాట గురించి తెలుసుకుందాం. ఈ పాట లిరిక్స్, పాటలోని విశేషాలు ఇక్కడ చూద్దాం.
Key Points
ఘటోత్కచుడు సినిమాలోని సూపర్ హిట్ పాట 'అమ్మ ప్రేమ చెప్పే అందాల అపరంజి బొమ్మ'
కైకాల సత్యనారాయణ గొప్ప నటనతో ఆకట్టుకున్న పాత్ర
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రమణ్యం గానం
తల్లి ప్రేమను చిత్రించే హృద్యమైన పాట
ఘటోత్కచుడు సినిమా సూపర్ హిట్ పాట
తెలుగు లెజండరీ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. పౌరాణిక పాత్రలతో ఆయన ఎంతగానో మెప్పించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో యముడి పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆయన తర్వాతే ఎవరైన అనేంతలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి కైకాల సత్యనారాయణ పోషించిన మరో మంచి పౌరాణిక పాత్ర ఘటోత్కచుడు.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఘటోత్కచుడు సినిమాలో కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ పోషించి మెప్పించారు. కథ, కథనాలు, నటీనటుల యాక్టింగ్ పరంగానే కాకుండా ఇందులోని పాటలు కూడా ఎంతగానో హిట్ సాధించాయి. ఘటోత్కచుడుగా కైకాల సత్యనారాయణ నటించిన ఈ సినిమాలో అందాల అపరంజి బొమ్మ ఒక సూపర్ హిట్ సాంగ్.
తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత శత్రువుల నుంచి తప్పించుకున్న చిట్టీ అనే పాప అడవిలో తప్పిపోతుంది. పూర్వ జన్మలో తను ఇచ్చిన మాట ప్రకారం పాపను ఆదుకోడానికి వస్తాడు ఘటోత్కచుడు. అప్పుడు అమ్మ కోసం ఏడ్చే చిట్టికి అమ్మ ప్రేమ చెప్పే క్రమంలో అందాల అపరంజి బొమ్మ సాంగ్ వస్తుంది.
“స్వర్గానా ఉన్న మాత.. నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన (కూతురు). నీ మాటగా నేను చెప్పెదు తల్లి. ఆహా.. దివ్యోపదేశం.. దివ్యోపదేశం మాతా” అని ఘటోత్కచుడు (కైకాల సత్యనారాయణ) అంటే చెప్పు “అంకుల్.. అమ్మ ఏం చెప్పిందో చెప్పు” అని చిట్టి (బేబీ నిఖిత) బతిమిలాడుకుటుంది. దాంతో “చెప్తాను తల్లి చెప్తా” అంటూ ప్రారంభమయ్యే అందాల అపరంజి బొమ్మ సాంగ్ లిరిక్స్ ఇక్కడ విందాం.
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
చూడలేదమ్మా నీ కంట చెమ్మా..!
కనుమరుగునున్నా నిను మరువదమ్మా..
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా,
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
ఆకలందంటే ఆ చిన్ని బొజ్జా..
అమ్మ ప్రేమను చిత్రించే అందాల అపరంజి బొమ్మ
అడగకుండానే తెలుసుకోమందీ..!
నీకేం కావాలన్నా.. నాకు చెబుతూ ఉంటానంది.. ఆ..!
తానె లోకానున్నా.. నిన్ను చూస్తూ ఉంటానంది..!
నిను చూసుకుంటా నీ అమ్మలాగా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
మావయ్యనంటూ నిను చేరమందీ..
మంచి మాటలతో మరిపించమందీ..!
కథలెన్నో చెప్పి నవ్వించమందీ..
ఒడిలోన చేర్చి ఓదార్చమందీ..!
పాట లిరిక్స్ మరియు విశేషాలు
ఇట్టా పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి..!
మా పాపానిపుడూ కాపాడమంటూ..
దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
చూడలేదమ్మా నీ కంట చెమ్మా..!
కనుమరుగునున్నా నిను మరువదమ్మా..
కన్నీరు తుడిచే కబురంపేనమ్మా..
అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా..!
ఇలా మనసుకు హత్తుకునే పదాలతో సాగే ఈ అందాల అపరంజి బొమ్మ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. ఘటోత్కచుడు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డినే మూవీకి సంగీతం అందించడం విశేషం.
చివరగా, ‘అమ్మ ప్రేమ చెప్పే అందాల అపరంజి బొమ్మ’ పాట తెలుగు సినీ సంగీతంలో ఒక అపురూపమైన రత్నం. కైకాల సత్యనారాయణ గొప్ప నటనతో ఈ పాట మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.


