|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కల్కి సీక్వెల్ లో సాయి పల్లవి మాస్ ఎంట్రీ! దీపికా అవుట్? మేకర్స్ షాకింగ్ రియాక్షన్!

Published: 03-02-2026, 4:35 AM
కల్కి సీక్వెల్ లో సాయి పల్లవి మాస్ ఎంట్రీ! దీపికా అవుట్? మేకర్స్ షాకింగ్ రియాక్షన్!
  • కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో హీరోయిన్ మార్పుపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.
  • దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారని వస్తున్న వార్తలపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
  • సుమతి పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని మేకర్స్ తెలిపారు.
  • అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని, ఇవన్నీ ఊహాగానాలేనని మూవీ టీమ్ స్పష్టం చేసింది.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. హీరోయిన్ విషయంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని సమాచారం. దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందించిందో చూద్దాం!

సాయి పల్లవి ఎంట్రీ నిజమేనా?

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదటి పార్ట్‌లో సుమతి (SUM-80)గా మెప్పించిన దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ మైవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ మొదటి భాగం రూ. 1042 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి దీని సీక్వెల్ పైనే ఉంది. అయితే నిర్మాతలు సీక్వెల్ గురించి మౌనం వహిస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మార్పు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

దీపికా స్థానంలో సాయి పల్లవి?

సుమతి పాత్రకు సాయి పల్లవి పర్ఫెక్ట్ ఛాయిస్?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపిక పోషించిన సుమతి (SUM-80) పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవి ని సంప్రదిస్తున్నారు. ఈ విషయంపై ఈ మూవీ టీమ్ కు చెందిన ఒక ప్రతినిధి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

“అధికారికంగా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. కానీ దీపికా తప్పుకున్న తర్వాత సుమతి పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని పరిశీలిస్తున్న మాట వాస్తవమే. ఆ పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోతుందని వాళ్లు భావిస్తున్నారు” అని సదరు ప్రతినిధి హిందుస్థాన్ టైమ్స్ కు స్పష్టం చేశారు.

అయితే సాయి పల్లవిని ఇప్పటికే ఫైనల్ చేశారని, షూటింగ్ కూడా మొదలుకాబోతోందని వస్తున్న వార్తలను వారు ఖండించారు. “ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. దయచేసి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండండి” అని కోరారు.

సీక్వెల్లో సుమతి పాత్ర ఎలా ఉండబోతోంది?

సుమతి పాత్ర ప్రాధాన్యత ఏంటి?

సినిమా క్లైమాక్స్ లో భైరవ ( ప్రభాస్ ).. గర్భిణిగా ఉన్న సుమతిని తీసుకుని పారిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. ఇదే సమయంలో భైరవ మరెవరో కాదు, తన మిత్రుడు కర్ణుడి పునర్జన్మ అని అశ్వత్థామ గుర్తిస్తాడు. మరోవైపు సుమతి గర్భస్థ శిశువు సీరం ద్వారా శక్తిని పొందిన యాస్కిన్.. స్వయంగా సుమతిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో సుమతి పాత్ర నిడివి, ప్రాధాన్యత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. ఇలాంటి బరువైన పాత్రను సాయి పల్లవి ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి.

సాయి పల్లవి ఎంట్రీ గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.