
📌 Key Points
- నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి తర్వాత రెండు కొత్త ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు.
- బింబిసార 2 మరియు శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ ఈ ప్రాజెక్టులలో ఉన్నాయి.
- కళ్యాణ్ రామ్ తన మేనల్లుడు కాకినాడలో ప్రారంభించిన ఉదయ్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
- ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా, వ్యక్తిగత వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల కాకినాడలో తన మేనల్లుడు ప్రారంభించిన ఉదయ్ కేఫ్ రెస్టారెంట్ ఓపెనింగ్ లో కళ్యాణ్ రామ్ సందడి చేశారు. బింబిసార 2 అప్డేట్స్ కూడా పంచుకున్నారు.
కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో కళ్యాణ్ రామ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మెరిసిన కళ్యాణ్ రామ్, మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఇందులో బింబిసార 2 సినిమా కూడా ఉంది. బింబిసారా మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 కూడా తీస్తున్నాడు కళ్యాణ్ రామ్.
దీంతో పాటు శ్రీకాంత్ విస్సా అనే కొత్త దర్శకుడుతో యాక్షన్ మూవీ చేస్తున్నట్లు సమాచారం. అయితే అలాంటి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మేనల్లుడి రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం కాకినాడ వెళ్లారు నందమూరి కళ్యాణ్ రామ్. కాకినాడలో ఉదయ్ కేఫ్ పేరుతో తన మేనల్లుడు కొత్తగా రెస్టారెంట్ పెట్టాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమం నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్
కాకినాడలో కళ్యాణ్ రామ్ సందడి
మేనల్లుడి కోసం స్టార్ హీరో
ఇలా తన మేనల్లుడి వ్యాపారానికి మద్దతుగా నిలిచిన కళ్యాణ్ రామ్, స్టార్ హీరోగా బింబిసార 2 తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


