
బెంగళూరులో జరిగిన ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట ఘటనలో పలువురు మరణించారు. ఈ విషాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన బాధను ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.
Key Points
బెంగళూరులో జరిగిన ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట
పదిమందికి పైగా మృతి, చాలామంది గాయపడ్డారు
కమల్ హాసన్ తాజా చిత్రం 'థగ్ లైఫ్' విడుదల
బెంగళూరు విషాదం
బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పోస్ట్ చేశారు. ఈ ఘటన హృదయ విదారకంగా అనిపించిందని.. తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.
కమల్ హాసన్ ట్వీట్
కాగా.. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. చాలామంది ఫ్యాన్స్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.
థగ్ లైఫ్ విడుదల
మరోవైపు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
బెంగళూరు విషాదంపై కమల్ హాసన్ వ్యక్తం చేసిన బాధ, సానుభూతి అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


