
📌 Key Points
- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు లభించింది.
- చిరంజీవి రాజకీయాల్లో సీనియర్, సినిమాల్లో జూనియర్ అని కమల్ హాసన్ సరదాగా వ్యాఖ్యానించారు.
- కమల్ హాసన్ 16 ఏళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
- సింగీతం శ్రీనివాసరావుతో దాదాపు 50 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నట్టు కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో కమల్ హాసన్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని ఆయన అన్నారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కమల్ హాసన్
Kamal Haasan: ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలో నాకు జూనియర్. మేము 70వ దశకంలో లీడ్ రోల్ యాక్టర్స్.. అంటూ సరదాగా జోక్స్ వేశారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. తాజాగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకలో పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్ స్వీకరించారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా సింగితం శ్రీనివాసరావుకు వచ్చిన అవార్డును ఆయన గైర్హాజరు కావడంతో అది కూడా కమల్ హాసనే అందుకున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ..
‘‘నాకు తెలిసి ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. నేను మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నా వయసు 16 ఏళ్లు. అక్కినేని నాగేశ్వరరావు గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడానికి వచ్చాను. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో కూడా ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. నేను, నాకు 16 ఏళ్ల వయసు నుంచి హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎందరో మహానుభావులకు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
చిరంజీవి గురించి కమల్ కామెంట్స్
నేను సింగీతం శ్రీనివాసరావుకి వచ్చిన అవార్డు అందుకుంటున్నప్పుడు, ఆయనతో నేను చేసిన మొదటి సినిమా ‘సొమ్మొకడిది సోకొకడిది’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా పనంతా సింగీతం గారే చేశారు, కానీ అవార్డు మాత్రం నాకు వచ్చింది. మేము ఇద్దరం కలిసి దాదాపు 50 ఏళ్లుగా పని చేస్తున్నాము. ఆయన అంటే నాకు ఇష్టం.. కేవలం ఆయన పేరు నా తండ్రి పేరు (శ్రీనివాసన్) లాగా ఉంటుందని కాదు, నా సినిమా కెరీర్‌లో నేను చూసిన అత్యంత యంగెస్ట్ సీనియర్ ఆయనే. థాంక్యూ సీఎం సార్, ఆయనకు మీరు ఇచ్చిన ఈ గౌరవానికి మేమంతా గర్వపడుతున్నాము. ఆ సినిమాలో జయసుధ కూడా నాతో కలిసి పని చేశారు. ఇది చాలా పెద్ద కథలే.
హైదరాబాద్‌తో కమల్ అనుబంధం
ఇక చిరంజీవి గారు, నేను.. మేమిద్దరం సోదరులం. ఆయన రాజకీయాల్లో నాకు సీనియర్, సినిమాలో నాకు జూనియర్. మేము 70వ దశకంలో లీడ్ రోల్ యాక్టర్స్ అయ్యాము. ఇప్పుడు కూడా మేము 70లోనే ఉన్నాం.. అంటే అది సినిమా గురించి కాదు, మా వయసు గురించి చెబుతున్నాను. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదా!’’ అంటూ చిరుపై సరదాగా సంభాషించారు.
మొత్తానికి కమల్ హాసన్ తన ప్రసంగంతో అందరినీ నవ్వించారు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, సరదాగా కామెంట్స్ చేశారు. ఈ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

