|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kamal Haasan: నేను తప్పు మాట్లాడలేదు.. కమల్ హాసన్ లేఖ

Published: 03-06-2025, 7:30 AM
Kamal Haasan: నేను తప్పు మాట్లాడలేదు.. కమల్ హాసన్ లేఖ

కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సినిమాను నిషేధించగా, కమల్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ విషయమై ఆయన ఒక లేఖను విడుదల చేశారు.

Key Points

1

కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై వివాదం.

2

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ 'థగ్ లైఫ్' నిషేధం.

4

క్షమాపణ చెప్పకుండా కమల్ తన నిర్ణయంపై అంటుకున్నారు.

కన్నడ భాషపై వివాదం

ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.

కన్నడ సూపర్‌స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. ‘కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు’ అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.

‘థగ్ లైఫ్’ నిషేధం

కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్‌కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.

కమల్ హాసన్ ప్రతిస్పందన

కర్ణాటక హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా కమల్ తన నిర్ణయంపై కొనసాగుతున్నారు. ‘థగ్ లైఫ్’ విడుదలపై తన నిర్ణయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.