
థగ్ లైఫ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ తన తెలుగు సినీ జీవితం గురించి, తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. ఆయన తన సినిమా విజయాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Key Points
కమల్ హాసన్ 15 తెలుగు సినిమాలలో 13 విజయవంతమయ్యాయి.
థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
వైజాగ్ ప్రేక్షకులతో కమల్ హాసన్ అనుబంధాన్ని వివరించారు.
థగ్ లైఫ్ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కమల్ హాసన్ వైజాగ్‌తో అనుబంధం
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో మే 29న గ్రాండ్‌గా నిర్వహించారు. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వైజాగ్ గురించి, తెలుగు ప్రేక్షకుల గురించి, సినిమాలపై హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్‌ని ‘మరో చరిత్ర’ అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు” అని అన్నారు.
తెలుగు సినిమాల్లో కమల్ హాసన్ విజయం
“అలాంటి వైజాగ్‌లో సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం సినిమాలు చేశాను. ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే నా బ్యాడ్ ఫిలిమ్స్ మర్చిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారు. అందుకుగాను మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని కమల్ హాసన్ తెలిపారు.
“మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి థగ్ లైఫ్ సినిమా మీకు అందిస్తున్నాను. ఒక కళాకారుడు చేసే పని ఇదే. చాలా గ్రేట్ ఫిలిం ఇది” అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
‘థగ్ లైఫ్’ సినిమాపై కమల్ హాసన్ అభిప్రాయాలు
” శింబు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించారు. అభిరామి గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పర్ఫామెన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు” అని కమల్ హాసన్ పేర్కన్నారు.
“చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం” అని కమల్ హాసన్ తన స్పీచ్ ముగించారు.
కమల్ హాసన్ తన తెలుగు సినిమా ప్రయాణం గురించి, ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘థగ్ లైఫ్’ సినిమాతో మరో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.


