|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంచన రీ రిలీజ్: 15 ఏళ్ల తర్వాత కూడా ఊర మాస్ రెస్పాన్స్! రికార్డులు షురూ!

Published: 07-03-2026, 12:05 PM
కాంచన రీ రిలీజ్: 15 ఏళ్ల తర్వాత కూడా ఊర మాస్ రెస్పాన్స్! రికార్డులు షురూ!
  • కాంచన రీ రిలీజ్: టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి, ఊహించని రెస్పాన్స్!
  • 15 ఏళ్ల తర్వాత కూడా కాంచన మేనియా: బుక్ మై షోలో రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయాలు!
  • లారెన్స్ మార్క్ హర్రర్ కామెడీ: రీ రిలీజ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది!
  • శరత్ కుమార్, కోవై సరళ కామెడీ టైమింగ్: వెండితెరపై మళ్ళీ చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తి!

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. విడుదలకి ముందే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాంచన రీ రిలీజ్: టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్!

హర్రర్ కామెడీ సినిమాలలో ట్రెండ్ సెట్టర్ అయిన కాంచన సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. లక్ష్మీ రాయ్ ఇందులో హీరోయిన్గా నటించింది. శరత్ కుమార్, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. 2011లో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

15 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్: లారెన్స్ మ్యాజిక్ రిపీట్!

ఈ మూవీ ద్వారా నటుడిగా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చాలా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా కాంచన మూవీని మార్చి 13వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

రికార్డుల వేట మొదలు: రీ రిలీజ్‌లో కాంచన ప్రభంజనం!

బుక్ మై షో యాప్లో ఈ మూవీ టికెట్లు హాట్ కేక్ మాదిరి అమ్ముడుపోతున్నాయి. దానితో చాలామంది 15 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు ఇంత క్రేజ్ అంటే అది మామూలు విషయం కాదు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే రీ రిలీజ్ సినిమాలలో ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అని చాలామంది భావిస్తున్నారు.

కాంచన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఇది రీ రిలీజ్ సినిమాలలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.