
📌 Key Points
- కంగనా, చిరాగ్ పాశ్వాన్ మధ్య ఎఫైర్ రూమర్స్‌పై కంగనా స్పందన
- చిరాగ్‌తో ఎఫైర్ ఉంటే పిల్లలు పుట్టేసేవారంటూ కంగనా షాకింగ్ కామెంట్
- చిరాగ్ మంచి స్నేహితుడని, తమ మధ్య అలాంటిదేమీ లేదని కంగనా క్లారిటీ
- రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లోనూ కంగనా జోరు
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న సంబంధంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిరాగ్ పాశ్వాన్‌తో ఎఫైర్‌పై కంగనా క్లారిటీ
Kangana Ranaut: కంగనా రనౌత్ …, మండి ఎంపీగా నెగ్గిన ఈ బాలీవుడ్ క్వీన్ టేనే సంచలనం. ఆమె ఏది మాట్లాడినా అది సోషల్ మీడియాలో సెన్సేషనే. తాజాగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న సంబంధంపై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట్లో తెగ సర్క్యులేషన్ అవుతుంది. ముఖ్యంగా 2024 పార్లమెంట్ జరిగిన సమయంలో వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కడం ఒకరినొకరు చూసి నవ్వుకోవడం చూసి నెటిజన్లు రకరకాల కథలు అల్లారు. ఈ రూమర్లపై తాజాగా స్పందించిన కంగనా, తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇస్తూనే ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈపాటికి మాకు పిల్లలు కూడా పుట్టేసేవారు
స్నేహం మాత్రమే ఉందన్న కంగనా
“నిజంగానే చిరాగ్ పాశ్వాన్‌తో నాకు అఫైర్ ఉండి ఉంటే.. ఈపాటికి మాకు పిల్లలు కూడా పుట్టేసేవారు” అంటూ కంగనా కుండబద్ధలు కొట్టారు. చిరాగ్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేశారు. తామిద్దరం పదేళ్ల క్రితమే ‘మిలే నా మిలే హమ్’ అనే సినిమాలో కలిసి నటించామని, ఆ పరిచయంతోనే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటామని ఆమె వివరించారు. చిరాగ్ కూడా సినిమా నేపథ్యం నుండి రావడంతో అతనితో మాట్లాడటం చాలా బాగుంటుందని, తనతో ఒక రకమైన ఫ్రెండ్లీ వైబ్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, కంగనా ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లో పలకరించుకోవడం సహజమని, దానికి రొమాంటిక్ రంగు పూయాల్సిన అవసరం లేదని ఆమె ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించారు.
చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ
సినిమా కెరీర్‌ను కొనసాగిస్తున్న కంగనా
అయితే రాజకీయాల్లో ఇంత బిజీగా ఉంటూనే కంగనా తన సినీ కెరీర్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. 2026 ప్రారంభం నుండి ఆమె చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘భారత్ భాగ్య విధాత’ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, పదేళ్ల తర్వాత ఆర్. మాధవన్‌తో కలిసి ఆమె ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. దీనితో పాటు ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘క్వీన్’ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలో మొదలుకానుంది. గతంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఇప్పుడు రాబోయే కొత్త చిత్రాలతో మళ్ళీ తన సత్తా చాటాలని కంగనా భావిస్తున్నారు. ఏది ఏమైనా, “పిల్లలు పుట్టేవాళ్లు” అంటూ కంగనా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడమే కాకుండా, చిరాగ్-కంగనా రూమర్లకు ఒక రకమైన ఎండ్ కార్డ్ వేసినట్లయిందన్న మాట. మరి ఇప్పటికైనా రూమర్స్ ఆగుతాయా లేక అలాగే కంటిన్యూ అవుతాయా చూడాలి.
ఏది ఏమైనా కంగనా తనదైన శైలిలో రూమర్స్‌కు చెక్ పెట్టింది. ప్రస్తుతం రాజకీయ, సినీ రంగాల్లో ఆమె బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆమె ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.


