|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kannappa: ప్రత్యేకమైన ఘనత సాధించిన ‘కన్నప్ప’.. తెలుగు సినిమాకు ఇది గర్వకారణం అంటున్న టీమ్

Published: 16-07-2025, 12:37 PM
Kannappa: ప్రత్యేకమైన ఘనత సాధించిన ‘కన్నప్ప’.. తెలుగు సినిమాకు ఇది గర్వకారణం అంటున్న టీమ్

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం తాజాగా ఒక ప్రత్యేక ఘనతను సాధించింది. ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించడం జరిగింది. ఈ ఘట్టం తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం అని చిత్ర బృందం పేర్కొంది.

Key Points

1

కన్నప్ప చిత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబడింది.

2

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు ప్రదర్శనకు హాజరయ్యారు.

4

తెలుగు సినిమాకు ఇది గర్వకారణమైన ఘట్టమని చిత్ర బృందం అభిప్రాయపడింది.

రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన

డైనమిక్ హీరో మంచు విష్ణు, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మించారు. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య జూన్ 27న గ్రాండ్‌గా రిలీజైనా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుది. ఇదిలా ఉంటూ.. కన్నప్ప మూవీ తాజాగా ఓ ఘనత సాధించినట్లు తెలుస్తోంది.

చారిత్రక ఇతిహాసం ‘కన్నప్ప’ను ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు. ఈ చిత్రానికి ప్రముఖుల నుండి అద్భుతమైన సానుకూల స్పందన వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనతో వారసత్వం, భక్తి, సినిమాటిక్ ఎక్సలెన్స్‌ను మిళితం చేసిన ఈ చిత్రానికి జాతీయ గుర్తింపు లభించినట్టు అయిందని మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖుల నుండి అద్భుతమైన స్పందన

తెలుగు సినిమాకు గర్వకారణం

రాష్ట్రపతి భవన్‌లోని ప్రదర్శనతో కన్నప్ప చిత్రానికి జాతీయ గుర్తింపు లభించింది. తెలుగు సినిమాకు ఇది ఒక గొప్ప విజయంగా నిలుస్తుంది. చిత్ర బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.