
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా వాయిదా పడింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విష్ణు తెలిపారు.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం
కన్నప్ప ట్రైలర్ రిలీజ్ ఒక రోజు ఆలస్యం
శనివారం ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగును
విమాన ప్రమాదం నేపథ్యంలో వాయిదా
మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జూన్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు. దీంతో ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ ట్రైలర్ రానుంది.
కన్నప్ప మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ పెను విషాదం నేపథ్యంలో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
కన్నప్ప ట్రైలర్ రిలీజ్ తేదీ మార్పు
“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి నా గుండె పగిలింది. ఈ విషాదం నేపథ్యంలో రేపు ఇండోర్లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నాం. ఒక రోజు ఆలస్యంగా కన్నప్ప ట్రైలర్ రానుంది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని విష్ణు ట్వీట్ చేశాడు.
మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన మూవీ కన్నప్ప. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ముకేశ్ రుషి లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఈ భారీ బడ్జెట్ మూవీపై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ కొత్త తేదీ
ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల కిందట మంచు విష్ణు వెల్లడించాడు. అయితే విమాన ప్రమాదం నేపథ్యంలో అర్ధంతరంగా ఈ ఈవెంట్ వాయిదా పడింది. శనివారం (జూన్ 14) కన్నప్ప ట్రైలర్ రానుంది. అదే రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. జూన్ 27న తెలుగుతోపాటు వివిధ భాషల్లో కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతోంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో కన్నప్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడినట్లు మంచు విష్ణు ప్రకటించారు. ట్రైలర్ శనివారం విడుదల కానుంది.


