|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kannappa Trailer: జర్నీ బిగిన్స్ అంటూ మంచు విష్ణు అప్డేట్

Published: 14-06-2025, 4:22 AM
Kannappa Trailer: జర్నీ బిగిన్స్ అంటూ మంచు విష్ణు అప్డేట్

మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ ట్రైలర్ విడుదలకు సంబంధించిన తాజా సమాచారం అభిమానులను ఆకట్టుకుంటోంది. విష్ణు మంచు తన ట్వీట్ ద్వారా ట్రైలర్ విడుదల తేదీని వెల్లడించారు.

Key Points

1

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన.

2

జూన్ 27న థియేటర్లలో సినిమా విడుదల.

4

సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల అవుతుంది.

కన్నప్ప ట్రైలర్ విడుదల తేదీ

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(Sarathkumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా విడుదల తేదీ

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృదం వరుస అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్(Trailer) అప్‌డేట్ ఇస్తూ మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఈ నిరీక్షణ నేటితో ముగుస్తుంది.. ప్రయాణం ప్రారంభమవుతుంది.. కన్నప్ప ట్రైలర్ సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది.. అంతిమ భక్తి గాథ ఆవిష్కృతమవుతుంది.. హర్‌హర్‌మహాదేవ్’ అని రాసుకొస్తూ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కన్నప్ప చిత్ర నటీనటులు

A post shared by 24 Frames Factory (@24framesfactory)

మంచు విష్ణు ట్వీట్ ద్వారా కన్నప్ప ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.