|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్ప: ‘కన్నప్ప’ ట్రైలర్ అప్‌డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

Published: 10-06-2025, 7:40 AM
కన్నప్ప: ‘కన్నప్ప’ ట్రైలర్ అప్‌డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా ట్రైలర్ అప్డేట్‌తో కొత్త పోస్టర్ విడుదల చేశారు.

కన్నప్ప ట్రైలర్ రిలీజ్ డేట్

ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) డైరెక్షన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). డైనమిక్ హీరో మంచు విష్ణు (Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇస్తూ విష్ణు లుక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘విశ్వాసం.. అగ్ని.. ఉగ్రత.. జూన్ 13న ఆ దివ్య యోధుడి పిలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కన్నప్ప ట్రైలర్ ఉరుములతో వస్తుంది. మరెవరికీ లేని భక్తుడి గాథను చూడటానికి సిద్ధంగా ఉండండి. హర్ హర్ మహాదేవ్.. హర్ ఘర్ మహాదేవ్’ అంటూ ట్రైలర్ రిటీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్‌తో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మంచు విష్ణు కొత్త పోస్టర్

నటీనటుల వివరాలు

చివరగా, ‘కన్నప్ప’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత అభిమానుల ఆసక్తి మరింత పెరగడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.