|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara: Chapter 1: కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్‌ రికార్డ్స్‌ బ్రేక్‌!

Published: 16-10-2025, 6:56 AM
Kantara: Chapter 1: కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్‌ రికార్డ్స్‌ బ్రేక్‌!

రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండు వారాలు దాటినా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. హిందీలో భారీ వసూళ్లను సాధిస్తూ పుష్ప, సలార్‌ వంటి చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు, తాజా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Key Points

1

కాంతార చాప్టర్ 1 రెండు వారాల్లో రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

2

హిందీలో రూ.155.5 కోట్లతో ప్రభాస్ సలార్, పుష్ప రికార్డులను అధిగమించింది.

4

2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల ప్రభంజనం

కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్‌-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ స్టార్‌ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్’ (రూ. 118.5 కోట్లు),  పుష్ప: ది రైజ్ – పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు,  కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..

పుష్ప, సలార్‌ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార

పుష్ప -2: రూ. 812.14 కోట్లు

బాహుబలి- 2: రూ. 511 కోట్లు

కెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లు

కల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లు

హిందీలో సౌత్ సినిమాల టాప్ కలెక్షన్స్

ఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లు

మహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లు

కాంతార  చాప్టర్-1: రూ. 155.5 కోట్లు

సలార్ – పార్ట్ I: రూ. 152.65 కోట్లు

కాంతార చాప్టర్ 1 సాధిస్తున్న అద్భుతమైన విజయాలు సినిమా పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతున్నాయి. దీపావళి సెలవులతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.