|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కరాటే కళ్యాణి! డ్రెస్సింగ్‌పై రాజ్యాంగం ఏం చెప్పిందంటే..

Published: 25-12-2025, 8:37 AM
అనసూయకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కరాటే కళ్యాణి! డ్రెస్సింగ్‌పై రాజ్యాంగం ఏం చెప్పిందంటే..
  • అనసూయ వస్త్రాధారణపై శివాజీ కామెంట్స్‌కు కరాటే కళ్యాణి కౌంటర్.
  • రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చినా, విచ్చలవిడిగా బట్టలు వేసుకోవాలని చెప్పలేదన్న కళ్యాణి.
  • దేవాలయాల్లో శిల్పాలకు చీరలు ఉంటాయని, బట్టలు లేవని చెప్పడం సరికాదని వాదన.
  • అనసూయ వ్యాఖ్యలను మూర్ఖత్వంగా అభివర్ణించిన కరాటే కళ్యాణి.

శివాజీ డ్రెస్సింగ్ కామెంట్స్‌తో మొదలైన వివాదం మరింత రచ్చకెక్కింది. ఈ చర్చలో అనసూయ చేసిన వ్యాఖ్యలకు కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు. రాజ్యాంగం, దేవాలయ శిల్పాలపై అనసూయ వ్యాఖ్యలు మూర్ఖత్వమని కళ్యాణి విమర్శించారు.

డ్రెస్సింగ్ వివాదం: అనసూయ ఆగ్రహం

Karate Kalyani Vs Anasuya: హీరోయిన్ల డ్రెస్సింగ్ ‌ పై శివాజీ చేసిన కామెంట్స్ ‌ వివాదం రోజురోజుకి మరింత ముదురుతుంది . ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది . చిన్మయి శ్రీపాద , నటి అనసూయల ఎంట్రీతో ఈ వివాదం మరింత రచ్చకెక్కింది . మరి ముఖ్యంగా ఈ వివాదంలో అనసూయ వరుస పోస్ట్స్ ‌, కామెంట్స్ ‌ చేస్తూ వస్తోంది . నిన్నటి శివాజీ కామెంట్స్ ‌ అనంతరం వీడియో షేర్ ‌ చేసిన అనసూయ .. ఈ రోజు ఉదయం వరుస పోస్ట్స్ ‌ చేసింది . తన వయసు ఉద్దేశిస్తూ ఆంటీ అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది .

అలాగే ఆడవాళ్ల వస్త్రాధారణను తప్పుబడుతున్నవారంత .. దేవాలయాలపై ఉన్న విగ్రహలను దేవతలుగా చూస్తున్నప్పుడు బయట అమ్మాయిలను ఎందుకు తప్పుగా చూస్తున్నారని ప్రశ్నించింది . అయితే తాజాగా ఆమె పోస్ట్స్ ‌ పై కరాటే కళ్యాణి స్పందించింది . బిగ్ ‌ టీవీకి తాజాగా ఆమె ఇంటర్య్వూ ఇచ్చింది . అనసూయ ఈ వివాదాన్ని చిలిచిలికి గాలివానగా చెస్తుందన్నారు . ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండే అధికారం రాజ్యాంగమే ఇచ్చిందన్న అనసూయ కామెంట్స్ ‌ కి ఆమె ఘాటు రిప్లై ఇచ్చింది . రాజ్యంగా కేవలం వాక్ ‌ స్వాతంత్ర్యం ఇచ్చింది తప్పా .. విచ్చలవిడిగా బట్టలు వేసుకోవచ్చని రాజ్యాంగం చెప్పలేదు కూడా . దేవాలయాల్లో బొమ్మలకు బట్టలు ఉండవు అంటుంది .. దేవాలయాల్లోని బొమ్మలకు ఖచ్చింతంగా చీరలు ఉంటాయి .

కరాటే కళ్యాణి ఘాటు సమాధానం: రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఒకప్పుడు సినిమాల్లో ఉల్లిపోరలాంటి చీరలు వాడేవారు కానీ , నటీమణలు ఒంటినిండా బట్టలు వేసుకునేవారు . కాకపోతే .. వారి ఒంపుసొంపులు కనిపించేలా అలాంటి బట్టలు ఇస్తారు . అలాగే దేవాయాల్లోని బొమ్మలకు కూడా చీరలు ఉంటాయి . బట్టలు లేకుండ శిల్పి ఎలా చెక్కుతాడు . అజంత , ఎల్లోరా శిల్పం అంటూ శిల్పికి ఓ ద్రష్టి కోణం ఉంటుంది . అలా శిల్పాల ఒంపుసొంపులు కనిపించేలా చెక్కుతారు కానీ , చీరలు లేకుండ ఉండవు . బట్లలు లేకుండ కుచ్చులు అనేవి ఎందుకు ఉంటాయి . అవి రాయి కాబట్టి కనిపించవు . శిల్పాలకు చీరలు ఖచ్చితంగా ఉంటాయి ” అని కరాటే కళ్యాణి కన్ ‌ ఫాం చేశారు . అనంతరం అనసూయని ముర్ఖురాలిగా పేర్కొంది . శివాజీ వివాదంలోకి దేవుల్లను , దేవలయాల్లోని శిల్పాలను మధ్య తీసుకోవడం ముర్ఖుల లక్షణమన్నారు .

దేవాలయ శిల్పాలపై కరాటే కళ్యాణి స్పందన

వాళ్ల ప్రైవేట్ ‌ ఫంక్షన్ ‌ లో ఎలా అయిన వేసుకోండి . పబ్లిక్ ‌ ఫంక్షన్ ‌ లోకి వచ్చినప్పుడు కస్తా పద్దతిగా వేసుకోండని చెప్పడం తప్పా అని పేర్కొంది . దీనికి దేవాలయాల్లోని బొమ్మలకి కనెక్ట్ ‌ చేయడం కరెక్ట్ ‌ కాదు . నా డ్రెస్ ‌ నా ఇష్టం అన్నప్పుడు .. నా చూపు నా ఇష్టం .. అని వాళ్లు అంటే ఏం చేస్తారు . మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాం .. వాళ్లు చూడొద్దని అంటారు . ఒళ్లంత కనిపించేలా బట్టలు వేసుకున్నప్పుడు .. అబ్బాయిలు కూడా చూస్తారు . మా చూపు మా ఇష్టం అంటారు అప్పుడు నువ్వు ఏం చేయగలవు అని ఘాటు వ్యాఖ్యలు చేసింది . ఇప్పుడు 30 వయసు దాటివారిని కూడా ఆంటీ అంటున్నారు . నువ్వు 40 దగ్గర్లో ఉన్నప్పుడు ఆంటీ అనరా ? ఇంకా నువ్వు స్వీట్ ‌ సీక్సిటినా ? అని వెటకరించింది . ఇద్దరు పిల్లలు ఉన్న నువ్వు ఆంటి కాదా ? ఆంటీ అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ అనసూయకు కళ్యాణ్ ‌ గట్టి చురకలు అట్టించింది .

శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ డ్రెస్సింగ్ వివాదం అనసూయ, కరాటే కళ్యాణిల మధ్య మాటల యుద్ధంగా మారింది. ఎవరు సరైనవారు, ఎవరు మూర్ఖులనే చర్చకు తావిస్తూ, ఈ సంఘటన సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.