
ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి ఆస్తి విషయంలో తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. సవతి తల్లిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Key Points
కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సవతి తల్లి నకిలీ వీలునామాతో మోసం చేస్తోందని పిల్లలు ఆరోపిస్తున్నారు.
సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన ఆస్తి విలువ దాదాపు రూ. 30 వేల కోట్లుగా అంచనా.
సంజయ్ కపూర్ సోదరి కూడా ఈ వివాదంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఆస్తి వివాదం నేపథ్యం
బాలీవుడ్‌లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్‌దేవ్‌ని వివాహమాడాడు.
పిల్లల ఆరోపణలు
ఈ ఏడాది జూన్‌లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్‌లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.
సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్‌దేవ్‌తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.
కోర్టుకు దరఖాస్తు
ఈ వివాదం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. కోర్టు తీర్పుతోనే ఈ వివాదానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.


