|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Lokesh Kanagaraj : నిర్మాతలుగా మారిన కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్

Published: 08-12-2025, 8:08 AM
Lokesh Kanagaraj : నిర్మాతలుగా మారిన కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్
  • ఇండస్ట్రీలో దర్శకులు నిర్మాతలుగా మారే ట్రెండ్ పెరుగుతోంది.
  • కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్ కలిసి రత్నకుమార్ సినిమా నిర్మిస్తున్నారు.
  • రత్నకుమార్ గతంలో విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘కూలి’ సినిమాలకు కో-రైటర్.
  • ఈ నిర్మాణ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

తమిళ సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రముఖ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతలుగా మారారు. రత్నకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రత్నకుమార్ గతంలో విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘కూలి’ వంటి సినిమాలకు కో-రైటర్‌గా పనిచేశారు.

దర్శకులు నిర్మాతలుగా మారే ట్రెండ్

Lokesh Kanagaraj : రోజులు మారుతున్న కొద్ది ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు కొన్ని సంవత్సరాలపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా అసోసియేటెడ్ గా పనిచేసిన వాళ్ళు తర్వాత కాలంలో దర్శకులుగా మారేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమ ప్రతిభను నిరూపించుకొని దర్శకులుగా మారిపోతున్నారు చాలామంది.

ముఖ్యంగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన చాలామంది దర్శకులు మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒకప్పుడు షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినవాళ్లే. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి తమిళ్ సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు యంగ్ డైరెక్టర్స్.

ఒకప్పుడు దర్శకులు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా సక్సెస్ కొడితే ఆ తర్వాత చాలా సంస్థల నుంచి విపరీతంగా అడ్వాన్సులు వస్తాయి. అలానే చాలామంది దర్శకులు నిర్మాతలుగా మారిపోతున్నారు.

కార్తీక్, లోకేష్ నిర్మించబోయే సినిమా

ఒకసారి స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్లు అనుకునే చిన్న కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో వాళ్ల అసిస్టెంట్ డైరెక్టర్స్ ను రైటర్స్ ను డైరెక్టర్ గా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుకుమార్ ఆల్రెడీ ఈ పని చేస్తున్నారు.

ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా ఇది మొదలవుతుంది కార్తీక్ సుబ్బరాజ్ , లోకేష్ కనకరాజు వీరిద్దరూ కలిసి రత్నకుమార్ దర్శకత్వం వహించబోయే సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

రత్నకుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ తమిళ్లో మంచి గుర్తింపు రత్నకుమార్ కు ఉంది. ఆల్రెడీ చాలా సినిమాలు కూడా చేశాడు. స్వతహాగా లోకేష్ కనగరాజు సినిమాలకు సంబంధించి రైటింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు.

రత్నకుమార్ ఎవరు? నేపథ్యం ఏమిటి?

రజనీకాంత్ హీరోగా చేసిన కూలి, ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమాలకు కో రైటర్ గా రత్నకుమార్ వర్క్ చేశారు. ఇప్పుడు కార్తీక్, లోకేష్ నిర్మాణ సారథ్యంలో సినిమాను చేస్తున్నారు. దీని గురించి అధికారకు ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది.

దర్శకులు నిర్మాతలుగా మారే ఈ కొత్త ఒరవడి సినీ పరిశ్రమకు మంచిది. కార్తీక్, లోకేష్ లాంటి స్టార్ డైరెక్టర్లు కొత్త ప్రతిభను ప్రోత్సహించడం శుభపరిణామం. రత్నకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.