
కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. గుడిలో దశరథ్, సుమిత్ర కలవగా, పోలీస్ స్టేషన్‌లో దీపను విడిపించడానికి కార్తీక్ జ్యోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సీరియల్‌లో తర్వాతి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
Key Points
గుడిలో దశరథ్, సుమిత్రల మధ్య భావోద్వేగ కలయిక చోటు చేసుకుంది.
పోలీస్ స్టేషన్‌లో దీపను జ్యోత్స్న బెదిరిస్తూ, కేసు నమోదు చేయమని ఒత్తిడి చేస్తుంది.
జ్యోకు పది నిమిషాల సమయం ఇచ్చి, తన భార్య దీపను విడిపించమని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.
శివ నారాయణ, పారిజాతం పోలీస్ స్టేషన్‌కు వచ్చి హైడ్రామా సృష్టిస్తారు.
గుడిలో దశరథ్, సుమిత్రల భావోద్వేగ కలయిక
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో గుడిలో కార్తీక్‌తో మాట్లాడుతుండగా దశరథ్ చూస్తాడు. దశరథ్, సుమిత్ర ఇద్దరు కలిసిపోతారు. దీప పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు కార్తీక్‌కు తెలుస్తుంది. జ్యోకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ బుద్ధి చెబుతాడు. పోలీస్ స్టేషన్‌కు శివ నారాయణ, పారిజాతం ఎంట్రీ ఇస్తారు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దశరథ్ గుడిలో సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుమిత్ర వింటుంది. ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు. చెప్పకు అని కార్తీక్‌ను వేడుకుంటుంది సుమిత్ర. దశరథ్ బాధపడుతుంటాడు. సుమిత్ర వెళ్లిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకొస్తానని వెళ్తాడు.
ఎక్కడ ఏ అఘాయిత్యాలు చేస్తుందో అని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు సుమిత్రతో కార్తీక్ మాట్లాడతాడు. మీ అత్త మొహం చూసే అర్హత కూడా నాకు లేదు అన్నారు. ఆయనకు ఎదురుపడే ధైర్యం లేక వెళ్లిపోతున్నాను. మీ మావయ్య ఏడవడం నేను చూడలేను. నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. నేను చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది అని ఏడుస్తుంది సుమిత్ర.
పోలీస్ స్టేషన్‌లో దీప, జ్యో హైడ్రామా
మావయ్య ఎదురుపడితే ఏం చేస్తావ్ అత్త అని కార్తీక్ అడుగుతాడు. క్షమించమని అడుగుతానో. చూస్తు ఉండిపోతానో నాకే తెలియదురా. ఆయన చూసేలోపే నేను వెళ్లిపోవాలి అని సుమిత్ర వెళ్లిపోతుంటే.. సుమిత్ర అంటూ దశరథ్ పిలుస్తాడు. సుమిత్రను చూసి తెగ సంతోషిస్తాడు దశరథ్. సుమిత్ర నువ్వు నా కాళ్ల మీద పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్కటి చేస్తే చాలు. నన్ను క్షమించు చాలు అని దశరథ్ అంటాడు.
పోలీస్ స్టేషన్‌లో కాంచన, దీప ఉంటారు. ఇది మా ఫ్యామిలీ విషయం. ఇంట్లో చూసుకుంటాం అని కాంచన అంటుంది. జ్యోత్స్న వినదు. ఎస్సై గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెల్‌లో వేసి సౌండ్ బయటకు వచ్చే వరకు కొట్టించండి. అప్పుడు నిజాలు బయటకొస్తాయి అని జ్యో అంటుంది. ఫోన్ చూసుకున్న కార్తీక్ దీపకు కాల్ చేస్తాడు. దీప ఫోన్ తీసుకుని జ్యోత్స్న మాట్లాడుతుంది.
పోలీస్ స్టేషన్‌లో నేరస్థులు మాట్లాడకూడదు అని జ్యోత్స్న అంటుంది. దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది, దీపను అరెస్ట్ చేసింది అని జ్యోత్స్న చేసింది, అనుకుంది చెబుతుంది జ్యోత్స్న. నీకు పది నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. పది నిమిషాల తర్వాత ఫోన్ నా భార్య చేతిలో ఉండాలి. నా భార్య ఇంట్లో ఉండాలి అని కార్తీక్ అంటాడు. 20 నిమిషాల తర్వాత కూడా పోలీస్ స్టేషన్‌లోనే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది.
జ్యోకు కార్తీక్ షాక్: పది నిమిషాల వార్నింగ్
మరోవైపు కార్తీక్, సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. రౌడీల నుంచి దీప ఇంటికి వెళ్లడం వరకు చెబుతుంది సుమిత్ర . జరగింది మర్చిపోదాం. నువ్వు ఈ గుడికి వస్తావని తెలిసింది. నిన్ను కలవచ్చే అని ఆశపడుతూ వచ్చానని దశరథ్ అంటాడు. మీ మాటలు విన్నాక ముందుకు రాడానికి ధైర్యం సరిపోలేదు అని సుమిత్ర అంటుంది. మనిద్దరి కలిసి చాలా దూరం ప్రయాణించాలి. మన కూతురు పెళ్లి చేయాలి అని దశరథ్ అంటాడు.
ఇంతలో కార్తీక్ వస్తాడు. దేవుడికి దశరథ్, సుమిత్ర పూజ చేయిస్తారు. పెళ్లిరోజునే ఇద్దరు కలిశారు. జ్యోత్స్న నువ్వు చేసిన పనికి జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెబుతాను అని కార్తీక్ అనుకుంటాడు. బావ వార్నింగ్ ఇచ్చి అరగంట అవుతుంది. ఇంకా ఏం చేయలేదేంటీ అని జ్యోత్స్న అంటుంది. దేనికైనా ఒక్క నిమిషం చాలు అని దీప అంటుంది.
మీరు ఎవరి మీద కేసు పెట్టారో తెలుసా. ఎవరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారో తెలుసా. ఈ శివ నారాయణ కూతురుని తీసుకొస్తారా అని శివ నారాయణ అంటాడు. అత్తే వస్తానంది అని జ్యో అంటుంది. నా కొడుకు లేని టైమ్‌లో కోడలిని తీసుకెళ్తే ఎలా ఊరుకుంటాను అని కాంచన అంటుంది. శభాష్ నా కూతురువి అనిపించావ్ అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్, సుమిత్ర కలయికతో పాటు, దీపను విడిపించేందుకు కార్తీక్ చేసిన ప్రయత్నం కీలకం. పోలీస్ స్టేషన్‌లో ఏం జరగబోతుంది? కార్తీక్ వార్నింగ్ తర్వాత జ్యో ఎలా స్పందిస్తుందో చూడాలి.


