|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు కార్తీక్ షాక్.. దీపను బతకనివ్వను.. దాసుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జ్యో

Published: 19-08-2025, 11:19 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు కార్తీక్ షాక్.. దీపను బతకనివ్వను.. దాసుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జ్యో

కార్తీక దీపం 2 సీరియల్ లోని తాజా ఎపిసోడ్ లో పారిజాతం కీలక విషయాలను బయటపెడుతుంది. కార్తీక్ మరియు దీపల పెళ్లికి సంబంధించి కొత్త ట్విస్ట్ వస్తుంది. జ్యోత్స్న దీనికి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Key Points

1

పారిజాతం కార్తీక్‌కు నిజాలు బయటపెడుతుంది.

2

కార్తీక్, దీపల పెళ్లి నిర్ణయం శివన్నారాయణ తీసుకుంటాడు.

4

జ్యోత్స్నకు కార్తీక్ నిర్ణయం పెద్ద షాక్‌గా మారుతుంది.

పారిజాతం కీలక విషయాలు బయటపెడుతుంది

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో ఆవేశంతో కార్తీక్ కు నిజాలు చెప్పేస్తోంది పారిజాతం. లాస్ట్ నంబర్ చెప్పేస్తున్నా వన్ అని అనేలోపు శివన్నారాయణ వెనకాల నుంచి పారును బయటకు గెంటేస్తాడు. చెప్పింది జరిగింది కదా పారు అని కార్తీక్ అంటాడు. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను పారిజాతం అని శివన్నారాయణ చెప్తాడు. నేనే ఫోన్ చేశానని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పుడు దెయ్యాన్ని చూస్తున్నా. నువ్వు పైకే కాదు లోపల కూడా దెయ్యానివని సీరియస్ గా అంటాడు శివన్నారాయణ.

పెళ్లి జరుగుతుందన్న కార్తీక్

అప్పుడే దశరథ్, సుమిత్ర, జ్యోత్స్న వస్తారు. శ్రీధర్ కు ఫోన్ చేసి పెళ్లికి రావొద్దని చెప్పిందంటా అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ పెళ్లికి నాన్న రావట్లేదా అని అడుగుతాడు దశరథ్. కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఎలా ఉంటాడు సార్ అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న , పారు షాక్ అవుతారు. మీరు పెట్టించిన ముహూర్తానికి మీ అందరి సమక్షంలో దీపకు, నాకు పెళ్లి జరుగుతందని కార్తీక్ అంటాడు. మీ నాన్న రానని బల్లగుద్ది మరీ చెప్పాడని పారు నోరు జారుతుంది. దీంతో శివన్నారాయణ ఫైర్ అవుతాడు.

కార్తీక్, దీపల పెళ్లి నిర్ణయం

కార్తీక్, దీపల పెళ్లి శివన్నారాయణ నిర్ణయం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఒకవేళ ఆగిందా? దానికి కారణమైన వాళ్లను క్షమించను అని శివన్నారాయణ అంటాడు. పారును తలా ఒక మాట అనేసి వెళ్లిపోతారు. తేడా వచ్చిందంటే ఈ సారి ఎక్కడికో వెళ్లి పడతావని పారుతో కార్తీక్ అంటాడు. మామయ్య పెళ్లికి వస్తున్నారు. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండని దీప అనడంతో కార్తీక్ విజిల్ వేస్తాడు.

శ్రీధర్ మామయ్య రాడని నువ్వు ఫోన్లో మాట్లాడిన విషయం తాతకు ఎలా తెలిసిందని పారును జ్యోత్స్న అడుగుతుంది. జరిగింది చెప్తుంది పారు. ఈ ఇంటి వారసురాలిని నేను కాదని ఏదో ఒక రోజు అందరికీ చెప్పేసేలా ఉన్నావని జ్యో అంటుంది. దీప అసలైన వారసురాలని నీ దగ్గర దాచింది ఇందుకే అని అనుకుంటుంది జ్యో. ఒక మెట్టు దిగి పెళ్లి జరగడానికి తండ్రి ముందు ఓడిపోయాడు బావ అని జ్యో చెప్తుంది. నాకైతే అనుమానం నిజమని అర్థమైంది. గ్రానీ కొడుకు మోసం చేశాడని జ్యో మనసులో అనుకుంటుంది.

జ్యోత్స్న వెళ్లి దాసును కలుస్తుంది. తన మీద ఒట్టు వేయించుకుని శివన్నారాయణ అసలైన మనవరాలిని నువ్వే అని దీపతో చెప్పావా లేదా? అని అడుగుతుంది. చెప్పానని దాసు అంటాడు. ఎందుకు చెప్పావని జ్యో ప్రశ్నిస్తుంది. తాళి ఎందుకు తెంపావంటాడు దాసు. దీప జోలికి వెళ్లొద్దని చెప్పా కదా అంటాడు దాసు. ఈ నిజం అందరికీ తెలిసే లోపు దీపను చంపుతాను లేదా నేనే చస్తాను. నువ్వు ఇక మాట్లాడొద్దు. నీలాంటి తండ్రి కడుపున పుట్టడమే నేను చేసిన పాపం. ఈ పాపాన్ని కడుక్కుంటా. దీపను బతకనివ్వను అని ఊగిపోతుంది జ్యోత్స్న. నేను దీపకు నిజం చెప్పలేదని దాసు అంటాడు.

జ్యోత్స్న, దాసు మధ్య గొడవ

గుండెల్లో ఉన్న భయం గొంతులోకి వచ్చినట్లుందని దాసు అంటాడు. ఒక్క క్షణం జీవితాన్ని తలకిందులు చేశావు కదా నాన్న. అంతా అయిపోయిందనుకున్నా. బావకు నిజం చెప్పావా? భార్య చేతిలో తాళి తెంపితేనే ఊరుకోని కార్తీక్ తన భార్య దశరథ అన్నయ్య కూతురు అని తెలిస్తే ఊరుకుంటాడా? అని దాసు మాట మారుస్తాడు. ఎందుకు మా అమ్మానాన్న చేతుల మీదుగా దీప పెళ్లి చేయిస్తున్నాడని జ్యో ప్రశ్నిస్తుంది.

దీన్నే విధి రాత అంటారు. పెళ్లి ఆపలేవు జ్యోత్స్న. ఇది నువ్వు రాసిన రాత కాదు. అందుకే దీపను శివన్నారాయణ ఇంటికి తీసుకొచ్చింది కాలం. ఓ అన్నాచెల్లి మంచి మనసుతో చేసుకున్న వాగ్దానం నిజమయ్యే రోజు వచ్చింది. దీన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ట్రై చేయకు అని దాసు అంటాడు. నువ్వు దీప పుట్టుక గురించి మర్చిపో అని జ్యో వార్నింగ్ ఇస్తుంది. నువ్వే నిజం చెప్పేయ్, అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పుట్టుక ఎలాంటిదైనా బతుకు గొప్పగా ఉండాలి. నిన్ను యువరాణిలా చూసుకుంటా. నా దగ్గరకు వచ్చేయమని అంటాడు దాసు. నిజం చెప్తే ఏం జరుగుతుందో ఊహించలేవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.

కార్తీక్ కు, దీపకు నిజాలన్నీ తెలుసు. ఇవన్నీ త్వరలోనే అందరికీ తెలుస్తాయి. నీకు భయం లేదు. ఈ నాన్న ఉన్నాడని జ్యో వెళ్లిపోయాాక దాసు అనుకుంటాడు. దీప పెళ్లి ఈ ఇంట్లో జరగకుండా ఎలాగైనా ఆపాలని పారు అనుకుంటుండగా శివన్నారాయణ ఇంట్లోకి శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నా కొడుకు పెళ్లికి నేను రావడానికి సిగ్గెందుకు అత్త అని శ్రీధర్ పారుతో అంటాడు. నా కొడుకు పెళ్లికి తండ్రిగా రావాల్సింది నేనే కదా. మాట మీద నిలబడ్డ గొప్పవాళ్లందరూ కాటికి వెళ్లిపోయారు. నేను వచ్చింది పెళ్లి కొడుకు తండ్రి హోదాలో అని అంటాడు శ్రీధర్. బ్యాచ్ మొత్తం వచ్చిందని అంటాడు. కార్తీక్, శౌర్య, కాంచన, అనసూయ రావడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు కార్తీక్, దీపల పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. జ్యోత్స్న, దాసు మధ్య గొడవ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.