|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీ, స్వ‌ప్న స‌ర్‌ప్రైజ్‌.. వంటలక్కకు నిజం చెప్ప‌ని కార్తీక్‌.. బావకు ముద్దు పెట్టిన దీప

Published: 27-08-2025, 9:48 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీ, స్వ‌ప్న స‌ర్‌ప్రైజ్‌.. వంటలక్కకు నిజం చెప్ప‌ని కార్తీక్‌.. బావకు ముద్దు పెట్టిన దీప

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్‌లో, దశరథ్ దీపను కార్తీక్‌కు అప్పగిస్తాడు. స్వప్న, కాశీల సర్‌ప్రైజ్ ఎంట్రీతో పాటు, కార్తీక్ తన వంటలక్కకు నిజం చెప్పకపోవడం, దీప బావకు ముద్దు పెట్టడం వంటి ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకుంటాయి.

Key Points

1

దీపను కార్తీక్ కు అప్పగించడంతో దీప ఎమోషనల్ అవుతుంది.

2

స్వప్న, కాశీ సర్ప్రైజ్ ఎంట్రీతో కేక్ కటింగ్ సెలబ్రేషన్.

4

దీప కార్తీక్ పెళ్లి డ్రెస్‌కు ముద్దు పెడుతుంది.

దీపకు కార్తీక్ అప్పగింత

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో దీపను కార్తీక్ కు అప్పగిస్తాడు దశరథ్. అప్పుడు దీప ఫుల్ ఎమోషనల్ అవుతుంది. పెళ్లయిన జంటకు కానుకు ఇవ్వాలని కానీ తన దగ్గర ఇప్పుడు ఏం లేదని శివన్నారాయణ అంటాడు. ఆడదాని అయిదో తనానికి గుర్తుగా బతికిినంత కాలం గుండెల మీద వేలాడే తాళిని ఇచ్చారు, ఇంతకంటే గొప్ప కానుక ఏముంది? ఇది చాలు. మీ ప్రేమ చాలు అని దీప అంటుంది. దీపకు నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటుంది జ్యోత్స్న.

రేపు మా ఇంట్లో సత్యనారాణయ వ్రతం కుటుంబంతో సహా రావాలని కాంచన ఆహ్వానిస్తుంది. శివన్నారాయణ ఇంటి నుంచి అందరూ వెళ్లిపోతారు. రాత్రి కుబేర ఫొటో ముందు దీపం వెలిగించి తమ్ముడు నీ కూతురు పెళ్లి చూసే ఉంటావు. నీ పెంపకం చాలా గొప్పది. నువ్వు కన్న తండ్రివి కాదని తెలిసినా అంత ప్రేమ ఏంటీ? దీప నీకు బంతిలో ఆకు వేసి భోజనం పెట్టిందని అనసూయ అంటుంది.

స్వప్న, కాశీ అప్పుడే ఎంట్రీ ఇస్తారు. శౌర్య మగపిల్లాడు అయితే కూతుర్ని కని ఇచ్చేదాన్ని అని స్వప్న అంటుంది. నేనేమన్నా వద్దన్నానా అని కార్తీక్ అనగానే స్వప్న ఎమోషనల్ అవుతుంది. కాశీ, స్వప్న తెచ్చిన కేకును దీప, కార్తీక్ కలిసి కట్ చేస్తారు. అన్నయ్య, వదిన ఒకరికొకరు తినిపించుకోవాలని స్వప్న అంటుంది. ప్రేమతో కార్తీక్, దీప కేకు తినిపించుకుంటారు. కాశీ ఫొటోలు తీస్తాడు.

స్వప్న, కాశీ సర్‌ప్రైజ్ ఎంట్రీ

శ్రీధర్ రాగానే కావేరీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఎందుకు ఇంత త్వరగా వచ్చారని అడుగుతుంది. కూతురు ఎక్కడా? అని అడుగుతాడు శ్రీధర్ . అల్లుడు వచ్చి తీసుకెళ్లాడని కావేరీ చెప్తుంది. ఈ జోడీ ఆ జోడీ దగ్గరగా వెళ్లారా అని అంటాడు శ్రీధర్. పెళ్లి ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ సారి జ్యోత్స్న హెల్ప్ తీసుకోవాలి. ఎప్పటికైనా జ్యోత్స్నను నా కోడలుగా చేసుకోవాలని శ్రీధర్ అనుకుంటాడు.

జరిగిన పెళ్లిని తలుచుకుంటూ దీప లోలోన సంబరపడుతుంది. కార్తీక్ పెళ్లి డ్రెస్ ను ముద్దాడుతుంది. ఆపాటి అదృష్టాన్ని నేను చేసుకోలేదా? అని వెనకాల వచ్చిన కార్తీక్ అడుగుతాడు. అది వేసుకున్న మనిషికి ఇంకెన్ని ముద్దులు పెట్టాలని కార్తీక్ అంటాడు. నేను మీ సొంతం అయినప్పుడు తీసుకోవడానికైనా ఇవ్వడానికైనా మీది కాని నా దగ్గర ఏముంది బావ అని దీప అంటుంది. మాటిచ్చి దాన్ని నిలబెెట్టుకున్నప్పుడు భార్య ముందు భర్త గొప్పగా కనిపిస్తాడు. తాళి జ్యోత్స్న తీసిందని అనుకున్నా. కానీ ఎవరు తీసి ఉంటారని దీప అడుగుతుంది.

సుమిత్ర తాళి తీసిందనే అసలు విషయాన్ని దీపకు చెప్పడు కార్తీక్. అది రహస్యంగానే ఉండిపోవాలని అనుకుంటాడు. తాళి కనిపించకపోవడం వల్ల మంచే జరిగింది. సాక్షాత్తూ మా అమ్మమ్మ మెడలో తాళి నా ఆశీర్వాదంగా వచ్చి నా భార్య మెడలో చేరి మా తాత కోరిక తీరిందంటే తాళి పోవడం మంచిదా? చెడ్డదా? అని కార్తీక్ అడుగుతాడు. ఈ టైమ్ లో డిస్కషన్ అవసరమా? అని కార్తీక్ అంటాడు. దీవించమని కాళ్లు మొక్కుతుంది దీప. ముద్దు పెట్టమంటే దండం పెడతావేంటీ అని దీవిస్తాడు కార్తీక్. ఎలా దీవించినా సరిపోలేదు సరిపోలేదని దీప అంటుంది.

కార్తీక్, దీప మధ్య ప్రేమ

అమ్మ దీప ఊరికే అన్నిటికి అలిగి మంచం మీద కూర్చోకుండా పాల లాంటి జీవితాన్ని తోడు పెట్టుకుంటావో, మీగడ తీసి నెయ్యి చేసుకుంటావో నీ ఇష్టం. మొగుడి మాటకు అడ్డుపడి పడక గదిని రచ్చబండ చేసుకుంటావో, సముద్రంలో నదిలా కలిసిపోయి కాపురాన్ని బృందావ‌నాన్ని చేసుకుంటావో నీ ఇష్టం అంటూ పొయెటిక్ గా ఆశీర్వదిస్తాడు కార్తీక్. వెంటనే లేచి కార్తీక్ కు ముద్దు పెడుతుంది దీప. కార్తీక్ స్టన్ అయిపోతాడు. ఇద్దరు రొమాంటిక్ గా చూసుకుంటారు.

మరోవైపు జ్యోత్స్న కు దిష్టి తీస్తుంది సుమిత్ర. ఈ ఇంట్లో దీప, కార్తీక్ ల పెళ్లితో గురువు చెప్పిన దోషం పోయినట్లే కదా పిన్ని అని దశరథ అడుగుతాడు. అవును దశరథ ఆ దేవుడి దయ వల్ల మనం త్వరగానే సమస్యను పరిష్కరించుకున్నామని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న తప్పు చేస్తే తిడతారు, మంచి పని చేస్తే దేవుణ్ని పొగుడుతారా? అని పారిజాతం అడుగుతుంది. దీప మెడలో తాళి తెంపడం జ్యోత్స్న చేసిన మంచి పని అని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లోని సంఘటనలు దీప మరియు కార్తీక్ మధ్య ప్రేమను మరింతగా చాటుతాయి. కార్తీక్ నిజాన్ని దాచుకోవడం కథలో మరింత ఉత్కంఠను కలిగిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.