
కార్తీక దీపం 2 సీరియల్‌లో నేటి ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. అనసూయ దీపకు కుబేర తన తండ్రి కాదని వెల్లడిస్తుంది. దీంతో దీపకు ఎలాంటి బాధ వస్తుంది? కార్తీక్ దీపకు ఎలాంటి మద్దతు ఇస్తాడు?
Key Points
అనసూయ దీపకు కుబేర తన కన్నతండ్రి కాదని నిజం చెప్పింది.
దీప తనకు కుబేరతో ఎలాంటి బంధం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది.
కార్తీక్ దీపకు తన బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చాడు.
దీప తన నిజమైన కుటుంబం గురించి తెలుసుకోవడానికి కష్టపడుతోంది.
అనసూయ నిజం వెల్లడి
కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్‍లో నేను కుబేర సొంత కూతురినేనా అని అనసూయను దీప అడుగుతుంది. కుబేర కూతురివే అని ముందుగా అబద్ధం చెబుతుంది అనసూయ. మా అమ్మకు పురుడు పోసేటప్పుడు అక్కడే ఉన్నావా అంటే అవునంటుంది అనసూయ. పుట్టగానే నిన్ను ఎత్తుకొని మీ నాన్న మురిసిపోయాడని చెబుతుంది. దీంతో కుబేర ఫొటోను తీసుకొచ్చి అనసూయతో ఒట్టు వేయిస్తుంది దీప. ఇప్పుడు నిజం చెప్పాలని అడుగుతుంది. దీంతో అనసూయ తల్లడిల్లిపోతుంది. నిజం చెప్పక తప్పడం లేదని అనుకుంటుంది.
ఇప్పుడు నేనేం చెప్పాలని మదనపడుతుంది అనసూయ. నిజం చెప్పు అంటూ దీప పదేపదే అడుగుతుంది. నేను కుబేర, అంబుజవల్లి కన్నకూతురినని ఒట్టేసి చెప్పు అత్త అని అనసూయను దీప గట్టిగా ప్రశ్నిస్తుంది. దీప అనాథ అని ఎవరికీ తెలియకూడదని గతంలో కుబేర తీసుకున్న మాటను అనసూయ తలుచుకుంటుంది. కానీ కుబేరపై దీప ఒట్టు వేయించడంతో నిజం చెప్పేస్తుంది. “నువ్వు నా తమ్ముడి (కుబేర) సొంత కూతురివి కాదు. ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని నా తమ్ముడు నా దగ్గర మాట తీసుకున్నాడు. దీప నా సొంత కూతురిగానే పెరగాలని నాతో చెప్పాడు. అందుకే ఈ నిజం నాకు, మీ నాన్నకు తప్ప ఎవరికీ తెలియదు” అని అనసూయ నిజం చెప్పేస్తుంది.
దీంతో తాను కుబేర కన్నకూతురిని కాదని దీపకు నిజం తెలిసిపోయింది. కార్తీక్ బాబు చెప్పిందంతా నిజమే అనుకుంటుంది. అసలు నీకు ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చిందని అనసూయ అడుగుతుంది. అంతకు ముందు పోలీస్ స్టేషన్‍లో అన్న మాట ఇంటికి వస్తే అబద్ధం చెప్పావని అది గుర్తొచ్చే అడుగుతున్నానని అసలు విషయం దాచేస్తుంది దీప. దాసుకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదని, ఇప్పుడు అతడికి గతం గుర్తు లేదు.. మరి ఎవరు చెప్పి ఉంటారని అనసూయ ఆలోచిస్తుంది. ఒట్టు వేయించినందుకు నిజం చెప్పకతప్పలేదని అనసూయ ఏడుస్తుంది.
నేను ఎవరి కూతురినో తెలుసా అని అనసూయను దీప అడుగుతుంది. నువ్వు బస్టాండ్‍లో దొరికావంట, ఏ తల్లికన్నబిడ్డవో, నీ అమ్మానాన్నలు ఎవరో తెలియదని అనసూయ అంటుంది. నిజం చెప్పి ఉండాల్సింది కాదని చెబుతుంది. ఈ మాట ఎవరికీ చెప్పకు అని అనసూయ అంటే.. ఎవరి మాత్రం చెప్పగలనని దీప అంటుంది. కుబేర ఫొటో పట్టుకొని బాధగా నడిచివెళుతుంది దీప. కన్నీరు పెట్టుకుంటుంది.
గుడిలో దీపాలు వెలిగిస్తూ బాధపడుతూ కూర్చుంటుంది దీప. నువ్వు మా సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల కన్నకూతురివి, నా సొంత మరదలివి, ఆ యావదాస్తికి ఏకైక వారసురాలివి అని కార్తీక్ చెప్పిన నిజాన్ని తలుచుకుంటూ ఉంటుంది. దశరథ్, సుమిత్రతో తనకు పరిచయమైన విషయాలను, ప్రేమ చూపిన సందర్భాలను గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి లోనవుతుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇక్కడికే వచ్చి ఉంటావని అనుకున్నానని కార్తీక్ అంటాడు.
నేను చెప్పిన విషయం గురించి అనసూయను అడిగావా అని దీపను ప్రశ్నిస్తాడు కార్తీక్. అడిగానంటుంది దీప. నేను చెప్పిన విషయాలను చెప్పావా అంటే.. లేదంటుంది దీప. ఎందుకు చెప్పుకోవాలి, అసలు మీరు నాకు నిజం చెప్పకుండా ఉంటే బాగుండేదని దీప అంటుంది. ఎందుకు అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఎన్నేళ్లు కుబేర కూతురిగా బతికా.. అలాగే వదిలేయాల్సిందని దీప అంటుంది. ఇలా ఆలోచిస్తావని అనుకోలేదని కార్తీక్ అంటాడు.
దీప యొక్క అనుమానాలు
మీరు చెబితే నేను ఆ ఇంటి వారసురాలిని అని వాళ్లు నమ్ముతారా, నమ్మినా నాపై ఉన్న ఆసహ్యాన్ని పక్కన పెట్టి కూతురిలా చూస్తారా, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారా అని దీప ప్రశ్నిస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనసు రావాలని కార్తీక్ అంటాడు. తాను దురదృష్టవంతురాలిని అని దీప అంటుంది. “అసలైన తల్లిదండ్రులకు దూరమయ్యా. పేరు పెట్టిన అమ్మ నాకు ఊహ తెలియక ముందే చనిపోయింది. పెంచిన తండ్రి యాక్సిడెంట్‍లో చనిపోయాడు. ఇప్పుడు మీరేమో సుమిత్ర, దశరథ్ మీ తల్లిదండ్రులు అంటున్నారు” అని దీప చెబుతుంది.
ఇప్పుడు నా వల్లే సుమిత్ర, దశరథ్ ప్రమాదంలో ఉన్నారని దీప అంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. నేనే వాళ్ల కూతురిని అని నాకు తెలిసిందని జ్యోత్స్నకు తెలిస్తే.. నన్నైనా చంపుతుంది, సుమిత్ర, దశరథ్‍లను అయినా లేకుండా చేస్తుందని బాధపడుతుంది. నేను ఎటైనా దూరంగా వెళ్లిపోతానని దీప అంటుంది. ఎటు అని కార్తీక్ అడుగుతాడు.
కుబేరను బతికించుకునే అవకాశం ఉంటే ప్రయత్నించే దానివా అని దీపను కార్తీక్ అడుగుతాడు. అవునంటుంది దీప. మరి వీళ్లను ఎందుకు వదిలేసి దూరంగా వెళతానని అంటున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నీ కంటే ఆ ఇంట్లో ప్రమాదం ముందే పుట్టింది.. ఇప్పుడు నీ స్థానంలో ఉన్న జ్యోత్స్న ఆ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని కార్తీక్ చెబుతాడు. అయితే నిజం చెప్పేయండి, దాసుతో చెప్పించండని దీప అంటుంది. మీ మేనత్త, మేనమామను కాపాడే బాధ్యత మీరు తీసుకోండని చెబుతుంది.
మరి నువ్వు, అసలైన వారసురాలు ఎక్కడ అని అడిగితే నేనేం చెప్పాలి అని కార్తీక్ అడుగుతాడు. చచ్చిపోయిందని చెప్పండని దీప బదులిస్తుంది. దీంతో కార్తీక్ అవాక్కవుతాడు. ఎందుకు అబద్ధం చెప్పాలని కార్తీక్ అడిగితే.. నేను వాళ్ల దృష్టిలో నేరం చేసిన మనిషిని కాబట్టి అని దీప అంటుంది. అమ్మ అని పిలిస్తే సుమిత్ర అసహ్యించుకుంటారని, పురిట్లోనే చచ్చిపోయి ఉన్నా బాగుండు అనుకుంటుందని దీప కన్నీళ్లతో అంటుంది. దురదృష్టం కొద్ది దీప లాంటి కూతురు పుట్టి ఉంటే బస్టాండ్‍లో పడేసే దాన్ని అని గతంలో సుమిత్ర అన్న మాటలను దీప గుర్తు చేసుకుంటుంది.
జ్యోత్స్నను చెడ్డదానిగా నిరూపించినా నమ్మరు, నేరం పారిజాతంపైకి పోతుందని దీప అంటుంది. ఇన్నాళ్లు సొంత కూతురిలా చూసిన జ్యోత్స్నను వాళ్లు వదులుకోరు అని చెబుతుంది. అప్పుడు నా తల్లిదండ్రులను ఎలా చూడాలని, నా మీద ప్రేమ ఉండదని బాధపడుతుంది. నాకు, శౌర్యకు కూడా ప్రమాదమే, ఇంక ఏం లాభం ఉంటుందని అంటుంది. అందుకే కదా అత్తయ్య, మామయ్యకు కాకుండా నిజం ముందుగా నీకు చెప్పానంటాడు కార్తీక్.
కార్తీక్ యొక్క హామీ
“జ్యోత్స్న ఏ ప్రమాదం తలపెట్టకుండా ఆపలేం ఎందుకంటే జ్యోకు ఆస్తి కావాలి. ఆ ఇంటి వారసత్వం కావాలి. దాని కోసం ఎంత మందినైనా చంపుతుంది. పారిజాతం అమ్మమ్మ అలా తయారు చేసింది” అని కార్తీక్ అంటాడు. మీరు జ్యోత్స్నకు భయపడుతున్నారా అని దీప ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు అని చెప్పాలంటే ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు, నమ్మకపోయినా నమ్మించగలం, కానీ ఇదంతా జరగాలంటే కాస్త సమయం పడుతుందని కార్తీక్ అంటాడు.
నిజాలు నమ్మే ప్రక్రియలో సుమిత్ర అత్త, దశరథ్ మామయ్య, తాత.. ముగ్గురి చచ్చిపోతే, ఆ నేరం నీమీదో నామీదో వేస్తే అని కార్తీక్ అంటాడు. బతికి ఉన్న అమ్మానాన్నను చంపుకోకూడదు కదా అని చెబుతాడు. వాళ్ల మీద నాకు ఎంత బాధ్యత ఉందో.. నీకు కూడా అంతే ఉందని చెబుతాడు.
వాళ్ల పక్కనే ఉన్న ప్రమాదాన్ని కలిసి ఆపాలని, ఇద్దరం కలిసి జోత్స్నకు బుద్ధి చెప్పాలని కార్తీక్ అంటాడు. ఆలోచించకు దీప.. మనకు టైమ్ లేదు అని చెబుతాడు. దాసుకు గతం గుర్తొచ్చిందనే అనుమానంతో జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిందని, ఆయనకు కూడా ప్రమాదంలో ఉన్నాడని అంటాడు. “నా లక్ష్యం ఏంటో నీకు ఇంతకు ముందే చెప్పా. నువ్వు మారాలి. నన్ను ఆ ఇంటికి వెళ్లనివ్వు. అందరికీ నువ్వేంటో తెలిసేలా చేస్తా. కాస్త టైమ్ ఇవ్వు. అందరికీ నిజం చెబుతా” అని కార్తీక్ అంటాడు. దీప ఆలోచనలో పడుతుంది.
ఇప్పుడు నీ సపోర్ట్ కావాలి దీప అని కార్తీక్ అడుగుతాడు. మనం ఇద్దరం ఒక మాట మీద ఉంటే జ్యోత్స్నకు బుద్ధి చెప్పి, ఈ రెండు కుటుంబాలను కలపగలమని కార్తీక్ అంటాడు. “దేవుడి సన్నిధిలో ఉండి మాటిస్తున్నా.. నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే బాధ్యత నాది” అని కార్తీక్ అంటాడు. ఎక్కడా రక్తం చుక్క రాకుండా ఇదంతా చేస్తా.. నువ్వు ఆవేశం తగ్గించుకోవాలని చెబుతాడు. నీ ఆవేశం వేరే వాళ్లకు అవకాశం కాకుడదు, నువ్వు కొత్త దీపలా కనిపించాలని కార్తీక్ అడుగుతాడు. మనం ఇచ్చే షాక్‍కు పారిజాతానికి, జ్యోత్స్నకు తాత కాళ్లు పట్టుకోవడం తప్ప మరో ఆప్షన్ ఉండకూడదంటాడు.
“నాకు నీ సపోర్ట్ కావాలి దీప. అర్థం చేసుకో, భయాలు వదిలెయ్” అని కార్తీక్ అడుగుతాడు. ఇంతలో గుడిలో గంట మోగుతుంది. మనకు అండగా ఉన్నానని దేవుడే చెబుతున్నాడని, నా దేవత నాకు సపోర్టుగా లేకపోతే ఎలా అని అంటాడు. దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 28) ఎపిసోడ్ ముగిసింది.
కుబేర తన తండ్రి కాదని తెలుసుకున్న దీప బాధలో మునిగిపోతుంది. కార్తీక్ ఆమెకు మద్దతుగా నిలుస్తాడని ఆశిద్దాం. ఈ సంఘటన దీప జీవితంలో కొత్త మలుపు తీసుకువస్తుందని భావిస్తున్నారు.


