
కార్తీక దీపం 2 సీరియల్ లోని తాజా ఎపిసోడ్ లో పారిజాతం శౌర్యకు కేక్ తీసుకు వస్తుంది. పారు జ్యోత్స్న గురించి కీలక విషయాలు తెలుసుకుంటుంది. కార్తీక్ తన ప్రాణదాతను వెతుకుతున్నాడు.
Key Points
పారిజాతం శౌర్య కోసం కేక్ తీసుకువచ్చింది.
పారు జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకుంది.
కార్తీక్ ప్రాణదాతను సుమిత్రకు పరిచయం చేయాలనుకుంటున్నాడు.
జ్యోత్స్న, శౌర్య కన్నబిడ్డ కాదని గొడవ పడుతోంది.
పారిజాతం శౌర్య కోసం కేక్
కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో శౌర్య కోసం పెద్ద కేకు తెచ్చానని పారిజాతం తెగ బిల్డప్ కొడుతుంది. పారిజాతం నువ్వు కేక్, చాక్లెట్లు తీసుకుని వచ్చేయ్. ఈ ఖర్చుల కోసం డబ్బు ఇచ్చానని చెప్పిన సంగతిని శివన్నారాయణ బయటపెడతాడు. శ్రీధర్ తనను పికప్ చేసుకున్నాడని పారు చెప్తుంది. చిన్నమ్మ, చెల్లి రాలేదా మాస్టారూ అని కార్తీక్ అడుగుతాడు. రాలేదని శ్రీధర్ అంటాడు. శౌర్యతో కేక్ కటింగ్ కు ముందు ఇంకో పని చేయాల్సి ఉందని సుమిత్ర అంటుంది.
ఆ మనిషి గురించి చెప్పు అని సుమిత్ర అడుగుతుంది. అదే మామయ్య లాకెట్ దొరికింది కదా ఆ మనిషి అని సుమిత్ర అంటుంది. నేను చెప్తానని చిన్నప్పుడు కోనేరులో కార్తీక్ మునిగిపోవడం, ఓ అమ్మాయి వచ్చి కాపాడటం, ఆ అమ్మాయి లాకెట్ కార్తీక్ దగ్గర ఉండిపోయిందని జరిగిన దాని గురించి పారు చెప్తుంది. ఈ విషయం నాకు తెలుసు పిన్ని అని కాంచన అంటుంది. ఆ అమ్మాయి ఎవరో కార్తీక్ కు తెలిసిందంటా, ఆ మనిషి కూడా దగ్గర్లోనే ఉందంటా అని పారు అంటుంది. నా ప్రాణ దాత ఎవరో నాకు తెలిసిందని అమ్మతో చెప్తాడు కార్తీక్.
ఇప్పుడు ఆ మనిషిని సుమిత్రకు పరిచయం చేస్తానని కార్తీక్ చెప్పాడని పారు అంటుంది. వదినకు పరిచయం చేయడమేంటీ? నా కొడుకు ప్రాణాలు కాపాడిన మనిషి ఎవరో నాకు తెలియాలి కదా అని కాంచన అంటుంది. నాకూ తెలియాలని అనసూయ, శౌర్య అంటారు. ఆ ప్రాణ దాత నేనే కదా బావ ఏం చెప్తాడో అని దీప అనుకుంటుంది. ప్రాణ దాతకు రుణపడింది నేను. ఆ మనిషి కార్తీక్ కే కాదు నాక్కూడా ప్రాణ దాతే. అలాంటి గొప్ప మనిషిని మనమే వెళ్లి కలవాలి. పదండి వెళ్దామని సుమిత్ర అంటుంది.
జ్యోత్స్న నిజస్వరూపం బయటపడటం
ఎదురుగా వస్తే రుణం తీర్చుకుంటాను. ప్రాణాలు కాపాడిన మనిషి దైవంతో సమానం. ఆ మనిషికి చేతులెత్తి దండం పెడతాను. తన లాకెట్ ను నా చేతులతో తన మెడలో వేస్తా. తను సాయం పొందే స్థితిలో ఉంటే ఎంత పెద్ద సాయమైనా చేస్తానని సుమిత్ర అంటుంది. అందరం వస్తామని అంటారు. తననే ఇక్కడికి రమ్మంటానని కార్తీక్ అంటే, బావ ఏదో ప్లాన్ వేశాడని దీప అనుకుంటుంది. వదిన వచ్చింది నాకు క్షమాపణ చెప్పడానికి కాదా, ప్రాణ దాత కోసమా అని కాంచన అనుకుంటుంది.
బయటకు వెళ్లి దాసుకు ఫోన్ చేస్తుంది పారిజాతం . కాశీ యాక్సిండెంట్ గురించి అల్లుడు చెప్పాడని పారు అంటుంది. నన్నెందుకు వదిలేశావు? నాతో మాట వరసకైనా చెప్పాలి కదా అని పారు అంటే, జ్యోత్స్న నీతో ఏం చెప్పలేదా? అని దాసు అడుగుతాడు. జ్యోత్స్నకు ఫోన్ చేసి సాయం చేయమ్మా అని అడిగా. గ్రానీకి చెప్పి సాయం చేస్తానని చెప్పిందని దాసు అంటాడు. కానీ సాయం చేయలేదు. ఒక రాత్రంతా నా కొడుకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నేను పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాడు. కన్నకూతురే మొహం చాటేసిన తర్వాత ఇంకా ఎవరిని అడగాలి? బావ లాయర్ ను తీసుకొచ్చి కాశీకి బెయిల్ ఇప్పించాడు. అవతలి వాళ్లకు డబ్బు ఇచ్చి కేసు లేకుండా చేశాడని దాసు వివరిస్తాడు.
శివన్నారాయణకు తెలియడం, ఆయన సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఎప్పటికైనా ఈ దాసు అందరికీ పరాయివాడే. ఇక్కడ బంధాలకు విలువ లేదమ్మా. ఉంటే నా కూతురు తన తమ్ముడి గురించి ఆలోచించేది. నా గురించి బాధపడకని దాసు ఫోన్ పెట్టేస్తాడు. నేను చాలా పెద్ద తప్పు చేశానని పారు బాధపడుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తే సీరియస్ గా చూస్తుంది పారు. పద తర్వాత మాట్లాడుకుందామని పారు అంటుంది.
ప్రాణదాత వెతకడం
శౌర్య కేక్ కట్ చేసి నాన్నకు ఫస్ట్ తినిపిస్తుంది. శౌర్య వీళ్లిద్దరికి పుట్టినట్టు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, చివరకు మామయ్య కూడా ముద్దు చేస్తున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. శివన్నారాయణ డబ్బులు తీసుకోకపోతే ఎప్పటికీ మాట్లాడనని అనడంతో శౌర్య తీసుకుంటుంది. కన్నకూతురికి తండ్రి బర్త్ డే చేస్తాడు. ఎవరో కూతురికి నువ్వు బాధ్యత తీసుకుని పుట్టిన రోజు చేయడం, శౌర్య నీ కన్న కూతురు అయితే బాగుండేది బావ అని జ్యో అంటే.. ఈ మాట అనే అర్హత నీకు ఉందా? అని దశరథ సీరియస్ గా అంటాడు. నువ్వు అలా మాట్లాడటం తప్పు అని నేను చెప్తున్నా అని పారు అనగానే అందరూ షాక్ అవుతారు.
శౌర్య బావ కన్న కూతురా? రక్త బంధానికి ఉన్న విలువా పెంచుకున్న బంధానికి ఉంటుందా? అని జ్యో ప్రశ్నిస్తుంది. ఇలాంటి మాటలు వినడానికే బాగుంటాయి జ్యోత్స్న. కొందరికీ రక్త బంధాలు ఉంటాయి. కానీ వాటికి ఏ విలువా ఇవ్వరు. కొందరు పెంచుకున్న బంధాన్ని కూడా రక్తబంధంలా చూసుకుంటారని పారు అంటుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, జ్యోత్స్న శౌర్యపై తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. పారు జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకొని ఆమెకు సమాధానం చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది. కార్తీక్ ప్రాణదాత వెతకడం కథానకం కొనసాగుతుంది.

