
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్‌లో, దీప తన గతం గురించి జ్యోత్స్నతో మాట్లాడుతుంది. అదే సమయంలో, శివన్నారాయణకు కోర్టు నుండి ఒక నోటీసు వస్తుంది, దీని వల్ల కార్తీక్ పై నింద పడుతుంది. శ్రీధర్ ఈ విషయంలో బకరాగా మారతాడు.
Key Points
శివన్నారాయణకు కోర్టు నుండి ఆస్తి కోసం నోటీసు వస్తుంది.
కార్తీక్ పై ఆస్తి వివాదంలో నింద పడుతుంది.
ఆస్తి కోసం చేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
కోర్టు నోటీసు మరియు ఆస్తి వివాదం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు ఎలా అనాథవు అయింటావని దీపను జ్యోత్స్న అడుగుతుంది. చాలా కాలం క్రితం జరిగిన కథ అంటూ కృష్ణుడి స్టోరీ చెబుతుంది దీప. అంటే మీ నాన్నే నిన్ను వదిలేశాడంటావా అని జ్యో అంటే.. ఏమో మా నాన్నకు ఉన్న శత్రువులే నన్ను చంపాలని అనుకోవచ్చు కదా అని దీప అంటుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ దేవుడి దయ వల్ల చావు నుంచి తప్పించుకుని ఉండొచ్చు కదా అని దీప అంటుంది.
అసలైన మీ అమ్మానాన్న ఎవరో నీకు తెలియదా అని జ్యోత్స్న ప్రశ్నిస్తే తెలియదు అని దీప చెప్తుంది. ఏమో ఏదో ఒక రోజు అసలైన నా అమ్మానాన్నను చేరుకుంటానేమో అని దీప అనగానే జ్యోత్స్న కంగారు పడుతుంది. దీపకు నిజం తెలుసో లేదో కనుక్కునేందుకు జ్యో ఆరా తీస్తుంది. కొన్నిసార్లు వాళ్లకు దగ్గరగా ఉండొచ్చు, కానీ అమ్మానాన్న అని తెలియకపోవచ్చని చెప్పి దీప వెళ్లిపోతుంది. దీప తెలిసి మాట్లాడుతుందా? తెలియకుండా మాట్లాడుతుందా? అని జ్యో అనుకుంటుంది.
శివన్నారాయణకు పోస్టు వస్తుంది. కోర్టు నుంచి నోటీస్ పంపించారని శివన్నారాయణ అంటే ఎవరు? అని కార్తీక్ అడుగుతాడు. పంపించింది నువ్వే కదా అని శివన్నారాయణ అంటాడు. నా తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన వాటా రాలేదంటూ నా కూతురు నోటీసు పంపించింది. కొడుక్కి తెలియకుండా పంపించిందా అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మా బావ ఆస్తి కోసం పట్టించుకునే మనిషి కాదని దీప అంటుంది. ఈ నోటీసు గురించి నాకు తెలియదని కార్తీక్ అంటాడు.
కార్తీక్ పై నింద, శ్రీధర్ బకరా
పెద్ద సారు చెప్పింది నిజమే. ఆస్తిలో వాటా కోసం మా అమ్మ పంపించినట్లుంది ఈ నోటీస్. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. వివరణ నేనే ఇస్తా. ఈలోపు తొందరపడి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దని కార్తీక్ అంటాడు. మీ ఇద్దరికీ తెలియకుండా నోటీస్ ఎలా వస్తుందని దశరథ అంటే.. సంబంధం లేని మూడో మనిషి ఆశ పడి ఉండొచ్చని దీపను ఉద్దేశించి సుమిత్ర అంటుంది.
నోటీస్ పంపిస్తే భయపడతా అనుకున్నారా? పెళ్లి విషయంలో నా మనవరాలికి అన్యాయం చేసి మీ అమ్మ నా గుండెల మీద తన్నింది. ఇప్పుడు ఆస్తిలో వాటా అడగడానికి సిగ్గుండాలి. నా పేరు మీద మీ అమ్మ నోటీస్ పంపించింది. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారా? అంటూ ఫైర్ అవుతాడు శివన్నారాయణ. ఒక గంట టైమ్ ఇవ్వండి. ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తానని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ గంట టైమ్ ఇస్తాడు.
ఏంటి బావ నోటీస్ ఎలా వచ్చిందని కార్తీక్ ను దీప అడుగుతుంది. ఇంకెవరు మా నాన్న. గతంలో కాగితాలపై సంతకాలు పెట్టించుకోవాలని చూశారు కదా. ఇప్పుడు తెలివిగా డీల్ చేయాలని కార్తీక్ చెప్తాడు. మరోవైపు తన ఇంట్లో శ్రీధర్ గంతులేస్తాడు. అప్పుడే శ్రీధర్ ఫోన్ కు కార్తీక్ నుంచి కాల్ వస్తుంది. నోటీస్ అందిందా? అంత మంచి పని నేను తప్ప ఎవరు చేస్తారు? రెస్పాన్స్ ఏంటీ? అని శ్రీధర్ అడుగుతాడు. నోటీస్ ఏం వద్దు. నీకు ఎంత కావాలని తాత అడిగాడని కార్తీక్ చెప్తాడు.
ప్లాన్ ఫెయిల్ అయిన విధానం
ఏం అడగాలో అర్థం కాక నీకు కాల్ చేశా. సాయం చేయాలని శ్రీధర్ ను అడుగుతాడు కార్తీక్. నువ్వయితే ఇక్కడికి రాకు మాస్టారూ అని కార్తీక్ రివర్స్ ప్లాన్ వేస్తాడు. దీంతో అక్కడికి వస్తున్నానని శ్రీధర్ చెప్తాడు. కానీ ఇప్పటికే ఓ తప్పు చేశారు, మరో తప్పు చేయకండని కావేరీ చెప్పినా శ్రీధర్ వినడు. శివన్నారాయణ ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. బావకు ఆస్తి మీద ఆశ లేదని జ్యోత్స్న పారుతో గుసగుసలాడుతుంది.
అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. శివన్నారాయణ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు శ్రీధర్. ఇంటికొచ్చిన గెస్ట్ కు మర్యాదలు ఇవ్వవా దీప అని అడుగుతాడు శ్రీధర్. నోటీస్ నేనే ఇచ్చానని శ్రీధర్ చెప్పేలా చేస్తాడు కార్తీక్. క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి. ఈ నోటీస్ కు ఎవరికీ ఏం సంబంధం లేదు. నా కొడుక్కి, భార్యకు న్యాయం చేయడం కోసం ఎవరికీ చెప్పకుండా నేనే పంపించానని శ్రీధర్ అసలు విషయం చెప్తాడు. అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. ఇచ్చిన టైమ్ లోనే ప్రూవ్ చేశానని కార్తీక్ అంటాడు.
ఆస్తి మొత్తం మూడు వాటాలు వేయాలి. ఒకటి దశరథ బావకు. రెండు నా భార్య కాంచనకు. మూడు మీకు. ఈ ఇల్లు మీరు ఉంచుకోండి. పాత ఇల్లు మాకు రాసేయండని ఆస్తుల చిట్టా తీస్తాడు శ్రీధర్. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి, శివన్నారాయణ కోపంతో ఉన్నాడు, కార్తీక్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీధర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో కథ మరిన్ని ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతుంది.


